అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS wins Gaddapotharam Municipality | మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) బీఆర్ఎస్ సత్తా చాటింది. అధికార కాంగ్రెస్కు షాక్ ఇస్తూ తొలి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సాగుతోంది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) గడ్డ పోతారం మున్సిపాలిటీ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ బల్దియాను గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఒక్క మున్సిపల్ ఫలితాలు మాత్రమే వెలువడగా.. దానిని బీఆర్ఎస్ (BRS) గెలుచుకోవడం గమనార్హం. గడ్డ పోతారంలో 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 3 కాంగ్రెస్, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
BRS wins Gaddapotharam Municipality | ఆధిక్యంలో కాంగ్రెస్..
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.105 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 50, బీజేపీ 12 వార్డుల్లో గెలుపొందాయి. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో, ములుగు 1వ వార్డులో, జోగిపేట 4వ వార్డు, ధర్మపురి 3వ వార్డు, నర్సాపూర్ 7వ వార్డు, ఎల్లంపేట 16వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. యాదగిరిగుట్టలో 2, 3, 4వ వార్డుల్లో, ధర్మపురిలో 1, 4, 7వ వార్డుల్లో, ఇంద్రేశం 15వ వార్డులో, మొయినాబాద్ 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
1 comment
[…] […]
Comments are closed.