HomeతెలంగాణHarish Rao | బీఆర్​ఎస్​ ఒంటరిగానే పోటీ చేస్తుంది: కవిత వ్యాఖ్యలపై హరీశ్​రావు

Harish Rao | బీఆర్​ఎస్​ ఒంటరిగానే పోటీ చేస్తుంది: కవిత వ్యాఖ్యలపై హరీశ్​రావు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Harish Rao | బీఆర్ఎస్(BRS) ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు అన్నారు. బీఆర్​ఎస్​ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చూస్తున్నారని ఇటీవల ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో హరీవ్​ రావు మాట్లాడారు. బీఆర్​ఎస్​ ఒంటరిగానే పోటీ చేసి 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరో పొత్తు పెట్టుకున్నం అన్నట్లు, ఇంకెవరో పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకోం అని స్పష్టం చేశారు.

Harish Rao | అధికారులకు వార్నింగ్

అధికారులకు హరీశ్​రావు వార్నింగ్​ ఇచ్చారు. కేటీఆర్(KTR)​ చెప్పినట్లు కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించినా, అక్రమ కేసులు పెట్టినా, మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్​ ఇచ్చారు. అలాంటి అధికారుల పేర్లు రెడ్ బుక్‌(Red Book)లో రాసుకొని గుణపాఠం చెబుతామన్నారు.

Harish Rao | దమ్ముంటే సీసీ ఫుటేజీ బయటపెట్టాలి

సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మిస్​ వరల్డ్​ పోటీల నిర్వహణలో విఫలం అయ్యారని హరీశ్​రావు విమర్శించారు. రాష్ట్ర పరువు తీశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక ఐఏఎస్ అధికారి మిస్ వరల్డ్ పోటీదారులతో (Miss World contestants) అసభ్యంగా ప్రవర్తించారని వార్తలు వస్తున్నాయన్నారు.

సీఎం రేవంత్​రెడ్డికి దమ్ముంటే సీసీ ఫుటేజీ బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. చిత్తశుద్ధి ఉంటే మిస్ వరల్డ్ పోటీదారులతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేయాలన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమంటే.. జిరాక్స్ కాపీ ఇచ్చి తప్పించుకున్నారని హరీశ్​రావు ఆరోపించారు.