అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌ను ఆయన ఖండించారు.
తమకు అక్రిడిటేషన్ కార్డులు (Accreditation Cards) ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ల ఎదుట నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి అధికారులకు వినతిపత్రం అందించారు. దీనిపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. జర్నలిస్టులను రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కల్పిస్తానని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పి, ఈరోజు జర్నలిస్టులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు.
Harish Rao | 26 వేల అక్రిడిటేషన్ కార్డులు
ప్రజాస్వామ్యయుతంగా జర్నలిస్టులు ధర్నా చేస్తుంటే అరెస్ట్ చేయడం సరికాదని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో 26 వేల అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. జర్నలిస్టుల కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించామని చెప్పారు. కరోనా సమయంలో విలేకరులను ఆదుకున్నట్లు తెలిపారు. జిల్లాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. జర్నలిస్టులకు (Journalists) ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 వేల నుంచి 10 వేలకు అక్రిడిటేషన్ కార్డులు తగ్గించారన్నారు. డెస్ జర్నలిస్ట్‌లకు అక్రిడిటేషన్ కార్డులు లేవంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా (Social Media) జర్నలిస్ట్‌లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Sessions) ఈ సమస్యపై మాట్లాడతామని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | ఫుట్‌బాల్ మ్యాచ్‌పై విచారణ చేస్తాం
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచుల మీద, ఫుట్ బాల్ మ్యాచ్ మీద పెట్టిన రూ.110 కోట్ల ఖర్చుపై విచారణ చేపట్టి బాధ్యులను జైల్లో పెడతామని మాజీ మంత్రి అన్నారు. ఎవరి సొమ్ము అని రూ.10 కోట్ల సింగరేణి నిధులతో ఫుట్‌బాల్ ఆడారని ఆయన ప్రశ్నించారు. సింగరేణిలో జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు కాని, ఫుట్ బాల్ ఆడి ఫోటోలు దిగడానికి రూ.10 కోట్లు ఎలా తీసుకుంటారని మండిపడ్డారు. సింగరేణిలో క్యాన్సర్ వచ్చిన వాళ్లను, గుండెకు బైపాస్ సర్జరీ చేసిన వాళ్లను, కాళ్లు, కండ్లు లేని వాళ్లను కూడా మెడికల్ బోర్డు సభ్యులు ఫిట్‌గా ఉన్నారంటూ ఉద్యోగం చేసుకోమని అంటున్నారని ఆయన అన్నారు.