అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BRS | పాతికేళ్ల పడిలోకి అడుగిడుతున్న బీఆర్ఎస్ BRS రజతోత్సవ వేడుకలకు sillver jublee సన్నద్ధమైంది. వరంగల్ warangal జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పది లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్న ఉద్యమ పార్టీ.. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసింది. గత కొద్ది రోజులుగా జరుగుతోన్న ఏర్పాట్లు తుది దశకు చేరాయి. అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న అతి పెద్ద కార్యక్రమం ఇదే. చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న గులాబీ శ్రేణుల్లో ఈ సభ సరికొత్త జోష్‌ను నింపుతోంది.
BRS | ఉద్యమ పార్టీగా ఏర్పడి..
దశాబ్దాల తెలంగాణ కోసం పురుడు పోసుకున్న పార్టీ బీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ TRS.. చరిత్ర పుటల్లో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను లిఖించుకుంది. రాష్ట్ర ఏర్పాటే ఏకైక అజెండాగా ముందుకొచ్చి, సబ్బండ వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లింది. రాజకీయ, సామాజిక పోరాటాలతో కేంద్రాన్ని కదిలించింది. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ గమ్యం చేరేదాకా నిలబడింది.
BRS | పుట్టుకే సంచలనం
ఉమ్మడి రాష్ట్రంలో వివక్షను ఎత్తిచూపుతూ ఏర్పాటైన ఆనాటి టీఆర్ఎస్.. ప్రస్తుత బీఆర్ఎస్ ఆవిర్భవమే అప్పట్లో ఒక సంచలనం. హైదరాబాద్ Hyderabad లోని జలదృశ్యంలో 2001 ఏప్రిల్ 27న జరిగిన సమావేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ andhra pradesh విభజనకు మూలం వేసింది. ఆ రోజు కొంత మంది తెలంగాణ వాదుల మధ్య కేసీఆర్ KCR టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటే ఏకైక అజెండాగా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఆయన చెప్పినట్లే ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ వెనుకడుగు వేయలేదు.
BRS | తొలి ఎన్నికల్లోనే భారీ విజయం
కేసీఆర్ తన వ్యూహాలు, రాజకీయ చతురతతో పది జిల్లాలను కదిలించారు. సభలు, పాదయాత్రలతో ప్రజల్లోనే ఉంటూ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. తెలంగాణ Telangana ఆవిర్భవ అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూనే రాజకీయంగా ఎదిగేలా ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో పార్టీ పెట్టిన కొద్ది రోజులకే వచ్చిన స్థానిక సంస్థల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. వేలాదిగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను గెలుచుకున్న టీఆర్ఎస్ రెండు జడ్పీలను కైవసం చేసుకుని తన రాజకీయ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించింది. తొలి నుంచి ప్రజల్లోనే ఉంటూ రాజకీయంగా ఎదిగిన గులాబీ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికలతో మరింత ఎదిగింది. తెలంగాణ ఏర్పాటు కోసమని కాంగ్రెస్‌తో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపింది. మొత్తం 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో 26 అసెంబ్లీ , ఐదు ఎంపీ సీట్లను గెలుచుకుని ఉద్యమ సత్తా చాటింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన టీఆర్ఎస్.. రాష్ట్ర ఏర్పాటులో తాత్సారం చేయడంతో ప్రభుత్వాల నుంచి బయటకు వచ్చింది. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లింది. అయితే, అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణంగా కొన్ని సిట్టింగ్ సీట్లను కోల్పోయింది. కానీ, కరీంనగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ సాధించిన విజయం తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటింది. ఇక, 2009లో మహా కూటమి పేరుతో టీడీపీతో జత కట్టిన టీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. ఆ దశలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ వెరువని కేసీఆర్.. ఉద్యమ పంథా మార్చారు. అదే సమయంలో 14 ఎఫ్ నిబంధనపై సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం congress Govt ప్రకటించింది.
BRS | టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా ..
2014లో రాష్ట్ర ఆవిర్బావం జరిగిన తర్వాత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధి పథం వైపు నడిపించారు. అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేకూర్చారు. మిషన్ భగీరథ mission bhageeratha, రైతుబంధు rythy bandu వంటి కొన్ని పథకాలైతే దేశానికే దిక్సూచిగా మారాయి. అయితే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణకు అడుగులేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది. మహారాష్ట్రలో పాగా వేయాలనుకున్న బీఆర్ఎస్‌కు.. తెలంగాణలో ఊహించని దెబ్బ తగిలింది. మొన్నటి ఎన్నికల్లో ఉద్యమ పార్టీని ప్రజలు పక్కన పెట్టేశారు. దీంతో గులాబీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం అలుముకుంది.
BRS | రజతోత్సవ సంబురం..
అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పరామర్శకు ఒకసారి, నల్గొండలో జరిగిన సభకు ఒకసారి మాత్రమే కేసీఆర్ బయటకు వచ్చారు. ఆ తర్వాత కనిపించనే లేదు. కేటీఆర్ ktr, హరీశ్‌రావు harish rao, కవిత kavitha ప్రజల్లో తిరుగుతూ పార్టీపై విశ్వాసం పెంచేలా ప్రయత్నిస్తున్నారు. శ్రేణులు నైరాశ్యంలో ఉన్న ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్ పాతికేళ్ల సంబురాలకు సిద్ధమైంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వేదికగా ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉద్యమ పార్టీ మళ్లీ ప్రజల ఆశీర్వాదం పొందేందుకు యత్నిస్తోంది.