HomeతెలంగాణBajireddy jagan | బీఆర్​ఎస్​ సభ.. కాంగ్రెస్ ​ప్రభుత్వ పతనానికి నాంది: బాజిరెడ్డి జగన్

Bajireddy jagan | బీఆర్​ఎస్​ సభ.. కాంగ్రెస్ ​ప్రభుత్వ పతనానికి నాంది: బాజిరెడ్డి జగన్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bajireddy jagan | వరంగల్​ జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్​ఎస్​ రజతోత్సవ సభ(BRS Silver Jubilee Celebration) కాంగ్రెస్​ ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని బీఆర్​ఎస్​ నేత బాజిరెడ్డి జగన్ Brs state leader bajireddy jagan ​ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరంగల్​ సభ Warangal Sabha కోసం రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోందన్నారు.

కాంగ్రెస్​ ఏడాదిన్నర పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మరోసారి కేసీఆర్​ KCR అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సభకు బీఆర్​ఎస్​ కార్యకర్తలు BRS activists భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.