అక్షరటుడే, కామారెడ్డి: BRS Rally in Kamareddy | కామారెడ్డి మున్సిపల్(Kamareddy Municipality) పాలకవర్గ ప్రమాణస్వీకారం ముగిసింది. ఛైర్పర్సన్గా స్వతంత్ర అభ్యర్థి (కాంగ్రెస్ రెబల్) ఇప్ప ఉమారాణి, వైస్ ఛైర్పర్సన్గా బీఆర్ఎస్ (Kamareddy BRS) అభ్యర్థి కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం బీఆర్ఎస్కు చెందిన 11మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
BRS Rally in Kamareddy | నిజాంసాగర్ చౌరస్తా వరకు..
గులాబీ రంగులు చల్లుతూ.. బ్యాండ్ మేళాల మధ్య నిజాంసాగర్ చౌరస్తా(Nizamsagar Square) వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి ఎవరి వార్డుకు వారు తమ వాహనాల్లో ర్యాలీలు తీశారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు వైస్ ఛైర్పర్సన్ కాసర్ల గోదావరి ర్యాలీగా బయలుదేరారు. దేవునిపల్లిలో ఆమెకు స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పలువురు వార్డు ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాసర్ల గోదావరి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసి భారీ మెజారిటీతో రెండోసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్లలో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశరాఉ. వచ్చే ఐదేళ్లు కూడా వార్డులో మరింత అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో 12వ వార్డును ఆదర్శంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు.

1 comment
[…] | హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్ఎస్… BRS Rally in Kamareddy | కామారెడ్డిలో బీఆర్ఎస్ భారీ.… JEE Mains 2026 Results | జేఈఈ మెయిన్స్ ఫలితాలు… […]
Comments are closed.