అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ponnam Prabhakar | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం బీఆర్ ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థి సునీత దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు.
ఆమెను ఏడవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం జూబ్లీహిల్స్ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తీరుపై నిప్పులు చెరిగారు.
Ponnam Prabhakar | ఇదేం పద్ధతి..
సోమవారం రహమత్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యే సునీత కంటతడి పెట్టారు. తన భర్త మాగంటి గోపినాథ్‌ను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్(KTR), హరీశ్‌రావు(Harish Rao)లపై ధ్వజమెత్తారు. సునీతపై తమకు సానుభూతి ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావులు తమ రాజకీయాల కోసం సునీతను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ వేదికలపై ఏడుపులు ఏడవడం మంచి పద్ధతి కాదని పొన్నం హితవు పలికారు.
Ponnam Prabhakar | చేసింది చెప్పుకుని ఓట్లడగాలి..
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు.. సోదరి మాగంటి సునీత(Maganti Sunitha)ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని పొన్నం వ్యాఖ్యానించారు. ఏడవాలని ఆమెపై బలవంతం చేస్తూ, దొంగ ఏడ్పులు ఏడ్పిస్తూ ఓట్లు అడగడం మంచి పద్ధతి కాదన్నారు. సెంటిమెంట్ తో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. అలా కాకుండా గత పదేళ్లలో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చెబుతూ ఓట్లు అభ్యర్థించాలి కానీ ఇలా దొంగ ఏడ్పుల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలనుకోవడం అవివేకమన్నారు.