అక్షరటుడే, హైదరాబాద్: BRS | పుర ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) కాస్త పుంజుకున్నట్లుగా తెలుస్తోందిన. అధికార కాంగ్రెస్ ను సగం మున్సిపల్ స్థానాల (65) కే పరిమితం చేసింది. తెలంగాణలో మళ్లీ బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలబడినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనే నిలబడిన బీఆర్ఎస్.. పుర పోరులోనూ తనదైన మార్క్‌ను చూపింది.
BRS | శ్రేణుల్లో నూతనోత్సాహం
తెలంగాణ రాష్ట్రంలో గత బుధవారం 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించారు. కాగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలను సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడంతో పలు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు చతికిలబడినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని 15 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మరో 700 వార్డుల్లో తన అభ్యర్థులను గెలిపించుకుంది. దీనికితోడు 35 చోట్ల హంగ్ పరిస్థితిని కల్పించింది. ఈ ఫలితాలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. రాబోయే పరిషత్ ఎన్నికల్లోనూ తమదైన మార్క్ కనబరిచేలా ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారం వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్ఠానం యోచిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
పార్టీలవారీగా మున్సిపాలిటీ వార్డుల ఫలితాలు..
- కాంగ్రెస్ – 1,322
- బీఆర్ఎస్ – 715
- బీజేపీ – 258
- ఇతరులు – 247