అక్షరటుడే, వెబ్డెస్క్: BRS boycotts ABN | బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ (ABN Andhra Jyothi channel) బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ అధికారికంగా వెల్లడించారు.
BRS boycotts ABN | ఛానల్ తీరుకు నిరసనగా..
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుపై (MLC Takkellapalli Ravinder Rao) ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఏబీఎన్ ఛానెల్లో జరిగే చర్చల్లో ఇక నుంచి పాల్గొనకూడదని నిర్ణయించారు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వంపై అసభ్యకరంగా వ్యవహరించిన చరిత్ర ఆంధ్రజ్యోతికి ఉందని పేర్కొన్నారు.
పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్తో పాటు జిల్లా కార్యాలయాల్లో జరిగే పార్టీ సమావేశాలకు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను ఇకపై అనుమతించరాదని నిర్ణయించినట్లు ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారి పట్ల ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు నిరసనగా..
ఏబీఎన్ ఛానెల్లో జరిగే చర్చల్లో ఇక నుండి బీఆర్ఎస్ నాయకులు పాల్గొనరు.
తెలంగాణ వచ్చిన తొలినాళ్లలోనే రాష్ట్ర నాయకత్వం పట్ల అసభ్యకరంగా… pic.twitter.com/JP74qYJ5HG
— BRS Party (@BRSparty) January 25, 2026