అక్షరటుడే, వెబ్‌డెస్క్: BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ఆవరణలో ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వీలైనంత త్వరగా లేదా మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కలవాలని భావించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను (Speaker Gaddam Prasad Kumar) కలిసి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయం అసెంబ్లీకి వచ్చారు.
BRS MLAs | అందుబాటులో లేని స్పీకర్..
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (BRS party MLAs) గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి సహా పది మంది శాసనసభ్యులు అసెంబ్లీకి చ్చారు. అయితే, ఆయన అందుబాటులోకి లేకపోవడంతో ఎమ్మెల్యేలు ధర్నా నిర్వహించారు. అసెంబ్లీ (Telangana Assembly) ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్‌ఎస్ నిరసన తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. అయితే, నిరసన విరమించాలని పోలీసులు కోరగా, అందుకు వారు నిరాకరించారు. శాసనసభ ఆవరణలో ధర్నాలు నిర్వహించవద్దనిసూచించినా పట్టించుకోలేదు. మరోవైపు, మీడియాను అనుమతించక పోవడంపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అయితే, శాసనసభ ఆవరణలతో మీడియాను అనుమతించక పోవడంపై పోలీసులు, జర్నలిస్టులకు కాసేపు వాగ్వాదం జరిగింది. ధర్నా అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.