అక్షరటుడే, హైదరాబాద్: BRS MLAs boycott assembly : పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ భారాస ఎమ్మెల్యేలు శాసనసభను బైకాట్ చేశారు.
అనంతరం అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లారు. అక్కడ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు PC Ghosh Commission report ను చించి చెత్త బుట్టలో పారేశారు.
BRS MLAs boycott assembly : ఘాటుగా స్పందించిన హరీశ్‌రావు..
పీసీ ఘోష్ నివేదిక పై మాజీ మంత్రి హరీశ్‌రావు Harish Rao ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి 14 ఏళ్ళు పోరాడి తెలంగాణ సాధించినందుకు శిక్ష వేస్తారా..? అని నిలదీశారు.
కరెంటు కోతలతో తిప్పలు పడ్డ తెలంగాణకు 24 గంటల కరెంటు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎండిపోయిన చెరువులకు జలకళను అందించినందుకు కేసీఆర్ మీద కేసు పెట్టాలా.. అని అడిగారు.
రైతులు చెప్పులు లైన్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఎరువులు అందించినందుకు కేసీఆర్ KCR మీద కేసులు పెట్టాలా.. అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడాలేని రైతుబంధు, రైతు భీమా ఇచ్చినందుకు కేసు పెట్టాలా.. అని నిలదీశారు.
చివరి వరి గింజ వరకు పంట కొనుగోలు చేసినందుకు కేసు పెడతారా.. ప్రాజెక్టులు కట్టినందుకు కేసులు పెడతారా ? హరీశ్ రావు నిలదీశారు.