అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ అనగానే బీఆర్ఎస్ సభ్యులు భయపడి సభ నుంచి వెళ్లిపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ (Assembly) వద్ద మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించడంపై బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చస్త్రశారు. అన్ని అంశాలపై చర్చించాలని బీఏసీలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)నే పట్టుబట్టిందన్నారు. వాళ్ల కోరిక మేరకే మేము అన్ని అంశాలపై చర్చ పెడుతున్నామని తెలిపారు. వాళ్లకు ఇబ్బందైన రోజు వాకౌట్ చేశారంటే ఓకే కానీ, మిగతా రోజులు కూడా రావకపోడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై చర్చ నుంచి తప్పించుకుంటుందని మండిపడ్డారు.
Bhatti Vikramarka | ప్రతిపక్షానికి బాధ్యత లేదా
కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసిందని భట్టి అన్నారు. రాష్ట్రాలపై భారం అదనపు భారం వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ పాల్గొనకపోవడం సరికాదన్నారు. దానిపై చర్చించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం బీఆర్ఎస్కు ఇంపార్టెంట్ కాదా అన్నారు. చర్చలో పాల్గొనకుండా సభను బహిష్కరించడం ప్రజలకు అన్యాయం చేయడమే అన్నారు.
సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలనేది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మండలి కవిత కంటతడి పెట్టడంపై భట్టి విక్రమార్క స్పందించారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట సభలో రికార్డు అయిందన్నారు.