అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mla Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(Mla Bhupathi Reddy) తల్లి లక్ష్మీ నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ మేరకు శనివారం బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి(MLA Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Goverdhan) తదితరులు నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి నివాసానికి వెళ్లారు.
ఆయన తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం భూపతిరెడ్డితో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. లక్ష్మీనర్సమ్మ మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. వారి వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.