ePaper
More
    HomeతెలంగాణCM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయి హరీష్‌రావు అసహనంతో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

    CM Revanth | అందుకే బీజేపీ గెలిచింది

    రాష్ట్రంలో లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ చేసిందని రేవంత్​రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్‌లో బీఆర్​ఎస్​ ఓడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy)పై సైతం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసరని, ప్రైవేట్​ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. కిషన్​రెడ్డి బీఆర్​ఎస్ కోసం​ పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లకముందే కిషన్ రెడ్డి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర పెద్దలతో కిషన్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు.

    CM Revanth | ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు

    గోదావరి జలాల (Godavari Water) తరలింపునకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని సీఎం ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్ అందుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతోనే చంద్రబాబు నాయకుడు బనకచర్ల ప్రాజెక్ట్​తో గోదావరి నీళ్లను తరలించారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని బీఆర్​ఎస్​ గెలవాలన్నా అవే కావాలని ఆయన అన్నారు. అందుకే ఈ నీటి వివాదాలు అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. చర్చలకు తామే ఒక అడుగు ముందుకేస్తామని.. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులైనా చర్చల కోసం కూర్చోవడానికి తాము సిద్ధం అన్నారు.

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల (Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...