అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Ponnam’s Campaign | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచారణతో రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ చూస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్‌లో మాట్లాడారు.
కేసీఆర్ (KCR)ను విచారణలో భాగంగా పిలిస్తే దానిని రాద్దాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలునిస్తున్నారని పొన్నం అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఇందులో కక్ష సాధింపు, కుట్రపూరిత అంశాలు లేవన్నారు. తెలంగాణ (Telangana)లోని నాయకులు, అధికారులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. దానిపై విచారణకు పిలిస్తే.. రాద్దాంతం చేయడంతో పాటు హింసాయుతమైన పిలుపులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ (BRS) యత్నిస్తోందన్నారు. విచారణను కక్ష సాధింపుగా ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు.
Minister Ponnam’s Campaign | కాంగ్రెస్‌ను గెలిపించాలి
మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) కాంగ్రెస్‌ను గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఆయన హుస్నాబాద్‌లోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగారు. హుస్నాబాద్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Minister Ponnam’s Campaign | సంక్షేమ పథకాలు వివరిస్తూ..
మంత్రి పొన్నం ఓటర్లకు సంక్షేమ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్, సన్న వడ్లుకు రూ500 బోనస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.