అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Uttam Kumar Reddy | అబద్ధాలు ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS chief KCR) సోమవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 90శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు (Palamuru Rangareddy project) సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేశాం అని కేసీఆర్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. ఆ ప్రాజెక్ట్‌కు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి కనీసం ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు, తట్టెడు మట్టి ఎత్తలేదని విమర్శించారు.
Minister Uttam Kumar Reddy | అధిక వడ్డీకి అప్పులు
గోబెల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దిట్ట అని మంత్రి అన్నారు. వాళ్లకే తెలివితేటలు ఉన్నట్లు, అవగాహన ఉన్నట్లు, గొప్పల సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మొత్తం బడ్జెట్ రూ.17.72 లక్షల కోట్లు అని చెప్పారు. ఇందులో ఇరిగేషన్‌పై రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అది కూడా అధిక వడ్డీకి అప్పులు తెచ్చారన్నారు. తక్కువ వ్యవధిలో ఆ లోన్లు కట్టేలా ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. దీంతో ఇరిగేషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఏటా రూ.16 వేల అప్పు కడుతున్నట్లు ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ తీసుకొచ్చిన అప్పుల వల్ల ఎలాంటి ప్రయోజనం జరగకపోగా నష్టమే ఎక్కువ జరిగిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ సమర్పించిన సమయంలో రూ.55,086 కోట్లు అన్నారు. కానీ రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. 90 శాతం పనులు ఎలా అయితాని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కోసం ఇంకా 30 వేల భూమిని సేకరించాల్సి ఉందన్నారు.