ePaper
More
    HomeతెలంగాణBC Reservations | బీసీలకు వెన్నుపోటు పొడిచిన బీఆర్​ఎస్​ : పీసీసీ చీఫ్​

    BC Reservations | బీసీలకు వెన్నుపోటు పొడిచిన బీఆర్​ఎస్​ : పీసీసీ చీఫ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BC Reservations | బీసీలకు బీఆర్​ఎస్​ వెన్నుపోటు పొడిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్​ పెద్దలతో చర్చించడానికి సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు(PCC President), పలువురు నేతలు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్​గౌడ్​ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు, కుల గణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే(Mallikarjun Kharge), లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ(Rahul Gandhi)కి వివరించామన్నారు.

    బీసీ రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్​ఎస్​ వ్యతిరేకిస్తున్నాయని మహేశ్​గౌడ్​ విమర్శించారు. బీఆర్​ఎస్(BRS)​ హయాంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 22శాతానికి తగ్గించి వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అసెంబ్లీలో బీసీ బిల్లులకు ఆమోదం తెలిపి తాజాగా యూటర్న్​ తీసుకుందని విమర్శించారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావు(Ramachandra Rao) వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.

    READ ALSO  Tiger Conservation | జీవో నంబర్​ 49పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఆదివాసీల హర్షం

    BC Reservations | తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలి

    బీసీ రిజర్వేషన్ల(BC Reservations) అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలని మహేశ్​గౌడ్​ డిమాండ్​ చేశారు. ఇదే అంశంపై ఖర్గే, రాహుల్​ గాంధీ రెండు గంటల పాటు చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాడతామని రాహుల్‌, ఖర్గే హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

    BC Reservations | బీసీలకు న్యాయం చేస్తాం

    బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్​ లక్ష్యమని మహేశ్​గౌడ్​ అన్నారు. తెలంగాణ కుల గణన చేపట్టిన తీరు, బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం సాయంత్రం ఇండియా కూటమి నేతలకు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇస్తామన్నారు. రాహుల్​ గాంధీ స్ఫూర్తితోనే తెలంగాణలో కులగణన చేపట్టామని వివరించారు.

    READ ALSO  Former MLA Baji Reddy | ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడ్తారా..? మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

    Latest articles

    KTR | కేటీఆర్ జన్మదిన వేడుకల్లో వేముల, జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్/భీమ్​గల్: KTR | తెలంగాణ భవన్​లో (Telangana Bhavan) గురువారం జరిగిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

    Maruti Suzuki | మారుతినుంచి తొలి ఈవీ కారు.. దేశీయ ఆటో మార్కెట్‌లో గేమ్‌ చేంజర్‌గా మారే అవకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Maruti Suzuki | దేశీయ ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా మారుతి సుజుకీ(Maruti...

    Collector Kamareddy | ప్రతి విద్యార్థి బాగా చదివి ఉన్నతస్థాయికి ఎదగాలి

    అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని.. బాగా చదువుకుని విద్యార్థులు...

    IB Notification | డిగ్రీతో ఐబీలో కొలువులు.. 3,717 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:IB Notification | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో కొలువుల భర్తీ కోసం...

    More like this