అక్షరటుడే, ఇందూరు: BRS Nizamabad | మున్సిపల్ కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ జెండా ఎగరేయాలని రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి (Rajya Sabha member Suresh Reddy) అన్నారు. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని సూచించారు.
BRS Nizamabad | నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా (Bigala Ganesh Gupta) మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల వద్దకు తీసుకువెళ్లి ఓట్లు అడగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలోని ఏ ఒక్క డివిజన్లో కూడా కొత్త అభివృధి పనులకు నిధులు మంజూరు చేయలేదనే విషయాన్ని ప్రజల వద్ద ప్రస్థావించాలని ఆయన సూచించారు. పదేళ్లలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని పార్కులను, బొడ్డెమ్మ చెరువును అభివృద్ధి చేశామన్నారు.
BRS Nizamabad | పూడికతీత.. నాలాల శుభ్రం
దశబ్దాల కాలంగా కనీసం పూడికతీతకు నోచుకోన్ని ఎన్నో నాలాలను శుభ్రం చేయించామని బిగాల తెలిపారు. వర్షాకాలంలో వరద నీటిని మళ్లించేందుకు స్ట్రాం వాటర్ డ్రెయినేజీలను నిర్మించామని, కాలనీలలో నీరు చేరకుండా డ్రెయినేజీలనుసైతం వెడల్పు చేశామన్నారు. నగరంలోని అన్ని కులాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు అందించి సేవ చేశామని తెలియజేశారు.
రాజకీయాలకు అతీతంగా కరోనా సమయంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నో కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేయాలని తెలిపారు. ఆశ వర్కలను, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, మహిళా సంఘాల నాయకులను, నర్సులు, మున్సిపల్ కార్మికులను, మార్కెట్ కమిటీలో పనిచేసే కార్మికులను అందరినీ అక్కున చేర్చుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మైనారిటీ ప్రెసిడెంట్ ఇమ్రాన్ శేహజాద్, అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు.