అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ నోట్లు (Fake Votes) నమోదు అయ్యాయని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), ఇతర నాయకులు సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)ని కలిసి ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్‌లో దాదాపు 20 వేల నకిలీ ఓట్లు నమోదు చేశారని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తుంది. 400 బూత్‌లలో ప్రతి బూత్‌కు దాదాపు 50 నకిలీ ఓట్లు ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. చిన్న స్పెల్లింగ్ మార్పులతో ఒకే వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. 150–200 ఓట్లు సింగిల్ ఇళ్లకు నమోదు చేయబడ్డట్లు బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఒక ఇంటి నంబర్‌తో నమోదైన 23 ఓటర్లలో ఎవరు కూడా అక్కడ ఉండటం లేదని ఆ యజమాని చెప్పినట్లు బీఆర్ఎస్ పేర్కొంటుంది. ఇప్పటికే 12 వేల చెల్లని ఓట్లను తొలగించినప్పటికీ, మరో ఏడు వేల నకిలీ ఎంట్రీలు నిశ్శబ్దంగా ఎంటర్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో సోమవారం ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు.
దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ద్వారా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. నకిలీ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారులను తక్షణ బదిలీ చేయాలన్నారు. నకిలీ ఓటర్లను తొలగించాలని కోరారు.
Jubilee Hills | మొదటి రోజు 10 నామినేషన్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొదటి రోజు పది నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. దొంగ ఓట్లపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇపుడు చెప్తున్న 43 ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.