అక్షరటుడే, ఆర్మూర్: Jeevan Reddy | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో (Jubilee Hills by-election) బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి పాటు పడాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ పరిధిలోని నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఉప ఎన్నికల్లో ప్రచార శైలి, పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశంలో యువ నాయకులు జైసింహా, స్థానిక నాయకులు, బీఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.