ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | కవిత ఫ్లెక్సీ దహనం చేసిన బీఆర్​ఎస్​ శ్రేణులు

    MLC Kavitha | కవిత ఫ్లెక్సీ దహనం చేసిన బీఆర్​ఎస్​ శ్రేణులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమె పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి వేటు వేసిన విషయం తెలిసిందే.

    కవిత(MLC Kavitha) కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలతో బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఆమె తీరుతో పార్టీకి నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్(KCR)​ కుమార్తె కావడంతో ఎవరూ కూడా బయట మాట్లాడే సాహసం చేయలేదు. కొందరు మాత్రం సోషల్​ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. తాజాగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్​ఎస్​ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

    MLC Kavitha | ఫ్లెక్సీల తొలగింపు

    కాళేశ్వరం ప్రాజెక్ట్​లో అవినీతి అక్రమాలకు హరీశ్​రావు(Harish Rao), సంతోష్​రావు(Santosh Rao) అని వ్యాఖ్యలు చేయడంతో పార్టీ ఆమెపై వేటు వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లను గులాబీ శ్రేణులు తొలగిస్తున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders) కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. హరీశ్ రావుపై కవిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    MLC Kavitha | స్వాగతిస్తున్నాం

    పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమని జుక్కల్​ మాజీ ఎమ్మెల్యే హన్మంత్​ సింధే(Former MLA Hanmant Shinde) అన్నారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

    More like this

    Pranahita – Chevella and SLBC projects | ప్రాణహిత – చేవెళ్ల, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులు పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Pranahita - Chevella and SLBC projects : దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ...

    Flood relief funds | వరద సహాయ నిధులు మంజూరు.. ఆ జిల్లాలకు రూ.10 కోట్లు..

    అక్షరటుడే, హైదరాబాద్: Flood relief funds : అతి భారీ వర్షాలు ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను...

    Collector Nizamabad | అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను తక్షణమే ప్రారంభించి...