అక్షరటుడే, బోధన్: MLA Sudarshan Reddy | ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ నాయకులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది.
MLA Sudarshan Reddy | కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం..
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని (MLA Sudarshan Reddy) పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు (Bodhan BRS) అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యే కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్తున్న వారిని తప్పించి పోలీస్‌స్టేషన్‌కు (Bodhan Police station) తరలించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు.
MLA Sudarshan Reddy | గత ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో అభివృద్ధి చేస్తున్నారే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా బోధన్ నియోజకవర్గం కేటాయించలేదన్నారు. కొత్తగా నిధులు తీసుకొచ్చి బోధన్ అభివృద్ధికి కృషి చేయాలని వారు నినదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాదవ్, మాజీ కౌన్సిలర్ గంగాధర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.