ePaper
More
    HomeజాతీయంRajasthan | పాఠశాలకు రూ.15 కోట్ల విరాళం ఇచ్చిన సోదరులు

    Rajasthan | పాఠశాలకు రూ.15 కోట్ల విరాళం ఇచ్చిన సోదరులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajasthan | ప్రస్తుత రోజుల్లో ఎంతో మంది సరైన విద్య అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేకపోవడం, ప్రైవేట్​ బడుల్లో చదివే స్థోమత లేక చాలా మంది విద్యార్థులు (Students) అరకొర చదువులతో నెట్టుకొస్తున్నారు.

    ఈ క్రమంలో తమ గ్రామంలో పిల్లలకు మంచి విద్య అందించాలని రాజస్థాన్​కు చెందిన సోదరులు ఆలోచించారు. అనుకున్నదే తడువుగా పాఠశాల అభివృద్ధికి ముందుకు కదిలారు. ఇందుకోసం తమవంతు సాయంగా ఏకంగా రూ.15 కోట్లు విరాళం ఇచ్చారు. ఇంత మొత్తంలో విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు ఈ సోదరులు.

    Rajasthan | ఆధునిక హంగులతో పాఠశాల అభివృద్ధి

    రాజస్థాన్‌(Rajasthan)లోని రాజ్‌సమంద్ జిల్లా శిశోదా గ్రామానికి చెందిన సోదరులు మేఘరాజ్-అజిత్ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరారు. ఈ క్రమంలో తాము పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలనుకున్నారు. నగరాలకు పరిమితమైన ఉత్తమ విద్యను తమ గ్రామంలోని విద్యార్థులకు కూడా అందించడానికి చర్యలు చేపట్టారు. తమ గ్రామంలోని స్కూలు అభివృద్ధికోసం ఏకంగా రూ.15 కోట్లు అందించారు.

    కాగా.. ఈ డబ్బులతో కంకుబాయి-సోహన్‌లాల్ ధకాడ్ kunkubayi sohanlal government school ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌ను అత్యాధునికంగా తయారు చేశారు. ఆధునిక ప్రయోగశాలలు, తరగతి గదులు, సౌకర్యాలతో కార్పొరేట్​ బడులకు దీటుగా తయారు చేశారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సోదరులను నెటిజెన్లు అభినందిస్తున్నారు. ఇలా ధనవంతులు తమ గ్రామాల్లో ప్రభుత్వ బడులకు చేయూత అందిస్తే ఎంతోమందికి మేలు జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.

    https://www.instagram.com/reel/DJ_ojhppPVQ/?utm_source=ig_web_copy_link

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...