Homeజిల్లాలునిజామాబాద్​Electricity Department | తెగిన విద్యుత్​ తీగలు.. పట్టించుకోని విద్యుత్​శాఖ

Electricity Department | తెగిన విద్యుత్​ తీగలు.. పట్టించుకోని విద్యుత్​శాఖ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Electricity Department | మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని శివారు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Electricity Department | కరెంట్​ లేక..

భారీ వర్షం కారణంగా కాలనీల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్​ తీగలు(Electrical wires) తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

నగరంలోని (Nizamabad City) పూలాంగ్​ (Pulang) ప్రాంతంలో కరెంటు తీగలు తెగిపోయి రోడ్లపై పడ్డాయి. రాత్రి తీగలు రోడ్డుపై పడ్డప్పటికీ విద్యుత్​ అధికారులు ఎవరూ స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి విద్యుత్​ లేక అవస్థలు పడుతున్నామని వాపోయారు. అధికారులు స్పందించి విద్యుత్​ పునరుద్ధరించాలని కోరారు.