ePaper
More
    Homeఅంతర్జాతీయంUK Fighter Jet | ఎట్టకేలకు ఎగిరిన బ్రిటిష్ రాయల్​ నేవీ​ విమానం

    UK Fighter Jet | ఎట్టకేలకు ఎగిరిన బ్రిటిష్ రాయల్​ నేవీ​ విమానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: UK Fighter Jet | నెల రోజులకు పైగా కేరళ(Kerala)లోని తిరువనంతపురంలో ఉండిపోయిన బ్రిటిష్​ రాయల్​ నేవి విమానం (British Royal Navy Flight) ఎట్టకేలకు టేకాఫ్​ అయింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జూన్​ 14న బ్రిటిష్ రాయల్ నేవీ F-35B లైట్నింగ్ ఫైటర్ జెట్​ను పైలెట్​ తిరువనంతపురం (Thiruvananthapuram)లో అత్యవసరంగా ల్యాండింగ్​ చేసిన విషయం తెలిసింది.

    UK Fighter Jet | మొండికేసిన విమానం

    ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఒకటైన ఎఫ్​ –35 కేరళలో ల్యాండ్​ అయిన తర్వాత తిరిగి ఎగరడానికి మొండికేసింది. విమానంలో ఇంధన కొరతతో పైలెట్​ తిరువనంతపురలంలో అత్యవసరంగా ల్యాండ్(Emergency Landing)​ చేశారు. అనంతరం భారత వైమానిక దళం ఆ విమానంలో ఇంధనం నింపింది. అయినా విమానం హైడ్రాలిక్​ ఫెయిల్యూర్​ సమస్యతో ఎగరలేక పోయింది. బ్రిటిష్​ ఇంజినీరింగ్​ నిపుణులు(British Engineering Experts) పలు మార్లు వచ్చి మరమ్మతులు చేశారు. అయినా నెల రోజులకు పైగా ఆ విమానం ఇక్కడే ఉండిపోయింది. 110 మిలియన్​ డాలర్లు విలువ చేసే అత్యంత అధునాతన విమానం ఎగరకపోవడంతో సోషల్​ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్​ చేశారు.

    UK Fighter Jet | మరమ్మతులు చేపట్టడంతో..

    బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్​కు చెందిన 24 మంది బృందం జూలై 6న కేరళకు వచ్చారు. యుద్ధ విమానానికి మరమ్మతులు చేయడానికి వారు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు సోమవారం మరమ్మతులు పూర్తి కావడంతో మంగళవారం ఉదయం విమానం టేకాఫ్​ అయింది. కాగా ఇన్ని రోజుల పాటు సదరు విమానానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) రక్షణాగా ఉంది. కాగా బ్రిటిష్​ విమానాన్ని తిరువనంతపురం ఎయిర్​పోర్టులో ఇన్ని రోజులు పార్కింగ్​ చేసినందుకు సరదు ఎయిర్​పోర్టు అద్దె తీసుకోనున్నట్లు సమాచారం. పార్కింగ్​ ఫీజు కింద రోజుకు రూ.26,261 చెల్లించినట్లు తెలుస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...