అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | భారీ వర్షాల నేపథ్యంలో డోంగ్లీ (Dongli) మండలంలోని లింబూర్ జీపీ పరిధిలోని వాడి (vaadi village) గ్రామాన్ని అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రవీణ్‌కుమార్ (Tahsildar Praveen Kumar) ఆర్ఐ సాయిబాబుతో కలిసి ట్రాక్టర్‌పై వాడి గ్రామానికి గురువారం వెళ్లారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడారు.
Nizamsagar | వాగు పొంగి పొర్లకముందే..
రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా మూడు, నాలుగు రోజులకు సరిపడా సరుకులు, కూరగాయాలు ముందే తెచ్చిపెట్టుకోవాలని తహశీల్దార్ ప్రజలకు సూచించారు. స్థానికంగా ఉన్న వాగు పొంగిపొర్లకముందే నిత్యావసర వస్తువులు తీసుకెళ్లి భద్రపర్చుకోవాలని పేర్కొన్నారు.
Nizamsagar | పురాతన ఇళ్లతో జాగ్రత్త..
గ్రామంలో పురాతన ఇళ్లు ఉంటే వెంటనే ఖాళీ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉండేవారి సమాచారం అందిస్తే వారిని స్థానిక పాఠశాలల్లో షెల్టర్ కల్పించడం జరుగుతుందని తహశీల్దార్ పేర్కొన్నారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తహశీల్దార్ కార్యాలయం లేదా కంట్రోల్‌రూంకు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.
వాడి గ్రామానికి ట్రాక్టర్లో వచ్చిన తహశీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఆర్ సాయిబాబు

