ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | చిన్న పొర‌పాటు.. కుక్క క‌ర‌వ‌డం వ‌ల‌న‌ ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల...

    Uttar Pradesh | చిన్న పొర‌పాటు.. కుక్క క‌ర‌వ‌డం వ‌ల‌న‌ ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల కబడ్డీ ప్లేయర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | కేవలం అవగాహన లేకపోవడం లేదా చిన్న విషయం అని నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక యువ క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదాన్ని కలిగించింది. 2026 ప్రో కబడ్డీ లీగ్ కోసం శిక్షణ తీసుకుంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కబడ్డీ ప్లేయర్ (Kabaddi Player) బ్రిజేష్ సోలంకి (22), ఒక చిన్న తప్పిదంతో తన జీవితం కోల్పోయాడు. కొన్నిసార్లు చిన్న గాయ‌మే ప్రాణాంతకమవుతుంది. బ్రిజేష్ కొన్ని వారాల క్రితం ఒక కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో, అది అతనిని కరిచింది. అయితే అది పెద్దది కాదని భావించిన బ్రిజేష్, యాంటీ-రేబిస్ టీకా(Anti-Rabies Vaccine) తీసుకోకుండా నిర్లక్ష్యం చేశాడు.

    Uttar Pradesh | కొంప‌ముంచిన నిర్ల‌క్ష్యం

    కాలక్రమంలో అతనికి రేబిస్ లక్షణాలు (Rabies symptoms) ప్రారంభమయ్యాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వైద్యం అందించినా ఫలితం లేకపోవ‌డంతో బ్రిజేష్ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై సంబంధిత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక 22 ఏళ్ల యువ క్రీడాకారుడు, రాష్ట్రస్థాయి ఛాంపియన్, ఇలా మృత్యువాత పడడం ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తోంది. ఇడెన్‌బర్గ్ యూనివర్సిటీ(Edinburgh University) నివేదిక ప్రకారం, రేబిస్ ప్రపంచవ్యాప్తంగా 10వ అత్యంత ప్రమాదకర అంటువ్యాధిగా గుర్తించబడింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 50,000–60,000 మంది రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు.

    భారతదేశం(India)లో ఈ కేసులు మరింత అధికంగా ఉన్నాయి. ప్రపంచ రేబిస్ మరణాల్లో 36 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఏటా 17.4 మిలియన్ల కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయని, వీటిలో 18,000 – 20,000 మందికి రేబిస్ సోకుతోందని అంచనా. చిన్న కాటు అయినా తక్షణమే వైద్యులు సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ రేబిస్ టీకా తీసుకోవడం తప్పనిసరి. కేవలం కుక్కలు కాకుండా, ఎలుకలు, మేకలు, ఇతర జంతువుల గాట్లు కూడా ప్రమాదకరమే. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రేబిస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అంశంపై వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి అని అంటున్నారు.

    Latest articles

    Today Gold Price | భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold, వెండి కొనుగోలుదారులకు మరో షాకింగ్ వార్త. ఆగస్టు 3,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    More like this