అక్షరటుడే, ఎల్లారెడ్డి: CM Revanth Reddy | వరదల కారణంగా జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో కామారెడ్డి (Kamareddy), ఎల్లారెడ్డిలో (Yellareddy) తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. లింగంపల్లి వంతెనపై (Pocharam Bridge) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను (Photo exhibition) తిలకించారు.
CM Revanth Reddy | ప్రభుత్వం అండగా ఉంటుంది..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిరకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బురుగిద్దలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం.. రైతులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.
అనంతరం ఆయన కామారెడ్డిలోని (Kamareddy) హౌసింగ్ బోర్డు కాలనీ.. జీఆర్ కాలనీలో పర్యటన నిమిత్తం ఎల్లారెడ్డి నుంచి బయలుదేరారు. సీఎం వెంట పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ (PCC Chief Bomma), మంత్రి పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ (Government Advisor Shabbir), ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు (Mla Madan Mohan Rao), లక్ష్మీకాంతారావు(Mla Lakshmi Kanta Rao), మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆయాశాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
పోచారం వంతెనను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు
పంటనష్టం వివరాలను సీఎంకు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరిస్తున్న ఎమ్మెల్యే మదన్మోహన్రావు
అధికారుల ద్వారా పంటనష్టాన్ని తెలుసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి