అక్షరటుడే, వెబ్డెస్క్:Bridge Collapsed | గుజరాత్(Gujarat)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వంతెన వాహనాలు వెళ్తున్న సమయంలో అకస్మత్తుగా కూలిపోయింది. వడోదర- ఆనంద్ పట్టణాల మధ్య పద్రా దగ్గర మహిసాగర్ నదిపై బ్రిడ్జి(Mahisagar River Bridge) కూలిపోయింది.
ఆ సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి.
రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు నదిలో పడిపోగా.. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాల్లోని పలువురిని రక్షించారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు(Gujrat Police) ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదంలో నదిలో కొందరు గల్లంతయినట్లు సమాచారం. వారి కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. వంతెన కూలడంతో వడోదర-ఆనంద్ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Bridge Collapsed | గతంలో సైతం..
గుజరాత్‌లోని సురేంద్ర నగర్ జిల్లా(Surendranagar District) వస్తాది గ్రామంలో 2023 సెప్టెంబర్లో ఒక పాత వంతెన కూలిపోయింది. ఆ సమయంలో వంతెన మీదుగా వెళ్తున్న డంపర్‌తో సహా రెండు బైక్‌లు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో పది మంది నీటిలో పడిపోగా.. స్థానికులు, సహాయక బృందాలు రక్షించాయి.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు 2022 అక్టోబర్లో మోర్బీ పట్టణంలోని కేబుల్ బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 140 మంది మరణించారు.