అక్షరటుడే, వెబ్‌డెస్క్: IAS Dhiman Chakma : అఖిల భారత సర్వీసు ఉద్యోగం (All India Service job) అంటే ఎందరో యువత కల. దేశంలోనే అత్యున్నత సర్కారు కొలువు. ఎంతో చమటోడ్చితే కానీ, అందుకోలేరు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఉద్యోగాన్ని ఆ యువకుడు సొంతం చేసుకున్నాడు. ఇక ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యతల్లో కొలువై ఉన్నాడు. కానీ, ఆ అధికారం తన సొంత ఎదుగుదల కోసం వినియోగించుకోవాలని అత్యాశ పడ్డాడు. అవినీతి అవతారం ఎత్తాడు. అడ్డదారిలో ఎదిగేందుకు లంచగొండిగా మారాడు. చివరకు అధికారులకు చిక్కాడు l.
ఒడిశాOdishaలోని కలహండి జిల్లాలోని ధరమ్‌గఢ్ సబ్-కలెక్టర్Sub-Collectorగా పనిచేస్తున్న 2021 బ్యాచ్ IAS అధికారి (2021 batch IAS officer) ధీమాన్ చక్మా స్థానిక వ్యాపారి నుంచి రూ.10 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. చక్మా అధికారిక ప్రభుత్వ నివాసంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
విజిలెన్స్ (vigilance department) అధికారుల కథనం ప్రకారం.. చక్మా వ్యాపారవేత్త నుంచి రూ.20 లక్షలు డిమాండ్ చేశాడు. సదరు మొత్తాన్ని చెల్లించకపోతే అతని వ్యాపార కార్యకలాపాలను అడ్డుకుంటానని బెదిరించాడు. స్వాధీనం చేసుకున్న రూ.10 లక్షలు లంచంలో భాగంగా తీసుకున్నట్లు నిర్ధారించారు.
చక్మా అరెస్టు తర్వాత, అతడి నివాసంలో సోదాలు చేపట్టగా.. అదనంగా రూ. 47 లక్షల నగదు గుర్తించారు. మరిన్ని ఆస్తులను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
