HomeతెలంగాణACB Case | భూమి సర్వే చేయడానికి లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

ACB Case | భూమి సర్వే చేయడానికి లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు ఆడులు చేస్తున్నా.. భయ పడటం లేదు. కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు.

డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. తాజాగా భూమి సర్వే చేసిని ప్రతిని అందించడానికి లంచం తీసుకున్న సర్వేయర్​పై ఏసీబీ అధికారులు(ACB Officers) కేసు నమోదు చేశారు.పెద్దపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి భూమి సర్వే కోసం ఇటీవల సర్వేయర్​ పైండ్ల సునీల్​ను కలిశాడు. ఈ మేరకు సర్వే చేసిన సునీల్ భూ సర్వే పంచనామా ప్రతిని అందజేయడానికి రూ.20 లంచం డిమాండ్​ చేశాడు. బాధితుడు బతిమిలాటడంతో రూ.పది వేలకు తగ్గించాడు. ఆ మొత్తాన్ని కటుకూరి రాజేందర్ రెడ్డి అనే ప్రైవేట్​ వ్యక్తికి ఫోన్​ పే చేసిన తర్వాత భూ సర్వే జిరాక్స్​(Land Survey Xerox) అందించాడు. అయితే ఈ విషయమై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వేయర్​ సునీల్, ప్రైవేట్ వ్యక్తి రాజేందర్​రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు.

ACB Case | అవినీతి కేంద్రాలుగా..

రాష్ట్రంలోని పలు తహశీల్దార్​ కార్యాలయాలు(Tahsildar Offices) అవినీతి కేంద్రాలుగా మారాయి. అటెండర్​, ఆపరేటర్​ నుంచి మొదలు పెడితే తహశీల్దార్​ వరకు లంచాల పేరిట ప్రజలను పట్టి పీడిస్తున్నారు. ముఖ్యంగా ఆపరేటర్ల ద్వారా అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ప్రతి రిజిస్ట్రేషన్​కు కొంత మొత్తం పక్కా వసూలు చేస్తున్నారు. అందులో ఏదైనా తప్పిదం ఉంటే.. వేలకు వేలు డిమాండ్​ చేస్తున్నారు. ప్రస్తుతం మండలాల్లో సర్వేయర్ల కొరత ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న సర్వేయర్లు(Surveyors).. రైతులు దరఖాస్తు చేసుకున్నా సర్వే చేయడానికి రావడం లేదు. డబ్బులు ఇస్తేనే సర్వే కోసం వస్తున్నారు.

ACB Case | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.