ePaper
More
    Homeక్రైంCBI Case | బీమా డబ్బులు చెల్లించడానికి లంచం డిమాండ్​.. సీబీఐ ఎంట్రీతో షాక్​

    CBI Case | బీమా డబ్బులు చెల్లించడానికి లంచం డిమాండ్​.. సీబీఐ ఎంట్రీతో షాక్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CBI Case | దేశంలో అవినీతి అధికారులకు కొదువలేకుండా పోయింది. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి (GP Secretery ) నుంచి మొదలు పెడితే సివిల్​ సర్వీసెస్ (Civil Services)​ అధికారుల వరకు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. తమ పనులను సక్రమంగా చేయాల్సిన అధికారులు లంచాలకు మరిగి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. బీమా డబ్బులు చెల్లించడానికి కూడా ఓ వ్యక్తి లంచం డిమాండ్​ చేశాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    ఉత్తర ప్రదేశ్​లోని ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్​ (Pratham UP Gramin Bank) రాంపూర్​ బ్రాంచ్​లో పని చేసే రికవరి ఏజెంట్​ రూ.4 లక్షల బీమా డబ్బులు చెల్లించడానికి లంచం అడిగాడు. రూ.20 వేలు ఇస్తే బ్రాంచ్​ మేనేజర్​ను ఒప్పించి ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేయిస్తానని చెప్పాడు. దీంతో బాధితులు బుధవారం సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం బాధితుల నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. రికవరీ ఏజెంట్​ను సీబీఐ అధికారులు (CBI Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం రాంపూర్​లోని నిందితుడి ఇళ్లలో సోదాలు నిర్వహించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...