అక్షరటుడే, హైదరాబాద్: Breast Cancer | హైటెక్ సిటీ Hi-Tech City యశోద హాస్పిటల్స్ (Yashoda Hospitals)లోని సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గౌడ్ “పింక్ పవర్” (Pink Power) రచించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు దీనిని రాశారు.
ఆదివారం (అక్టోబరు 26) రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి Women and Child Welfare Minister సీతక్క(Seethakka), Tollywood నటి శ్రీలీల(Srileela) కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. దేశంలోని మహిళల్లో అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) ఒకటని పేర్కొన్నారు.
Breast Cancer | స్వీయ నిర్ధారణకు ఉపయోగం..
గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో రొమ్ము క్యాన్సర్ పెరుగుతోందని మంత్రి తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం, భారత అతివల్లో రొమ్ము క్యాన్సర్ తీవ్రంగా ఉందన్నారు.
మొత్తం క్యాన్సర్లలో 27-32% వరకు రొమ్ము క్యాన్సరే ఉంటోందని తెలిపారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు.
రొమ్ము క్యాన్సర్ స్వీయ-నిర్ధారణ కోసం డాక్టర్ రాజేష్ గౌడ్ రచించిన “పింక్ పవర్” పుస్తకం స్త్రీలకు ఎంతగానో ఉపయోపడుతుందన్నారు.
