అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic Stock Markets).. ప్రాఫిట్ బుకింగ్‌తో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 344 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
వాణిజ్య ఒప్పందాల(Trade deal) విషయంలో భారతదేశం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోదన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లు డీలా పడ్డారు. యూఎస్, భారత్‌ల మధ్య ట్రేడ్ డీల్ ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేకపోవడంతో ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. దీంతో ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) సూచీలను వెనక్కి లాగింది. ముడిచమురు ధరలు పెరుగుతుండడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా ప్రభావం చూపించాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 44 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 84,707 పాయింట్ల వరకు పెరిగినా.. అక్కడినుంచి 754 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ ఇంట్రాడే(Intraday)లో 25,944 స్థాయికి చేరుకున్న తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో 226 పాయింట్ల వరకు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్(Sensex) 344 పాయింట్ల నష్టంతో 84,211 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 25,795 వద్ద స్థిరపడ్డాయి.
ఐటీలో జోరు..
బీఎస్‌ఈలో మెటల్ ఇండెక్స్(Metal Index) 1.02 శాతం, టెలికాం 1.01 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.25 శాతం, రియాలిటీ 0.24 శాతం, ఎనర్జీ 0.22 శాతం పెరిగాయి. బ్యాంకెక్స్(Bankex) 0.77 శాతం, హెల్త్‌కేర్ 0.75 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.71 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.70 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.58 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.51 శాతం, పవర్ 0.47 శాతం, ఆటో ఇండెక్స్ 0.45 శాతం నష్టపోయాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.32 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం నష్టంతో ముగిశాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,853 కంపెనీలు లాభపడగా 2,323 స్టాక్స్ నష్టపోయాయి. 166 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 155 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 68 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎయిర్‌టెల్ 1.03 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.88 శాతం, బీఈఎల్ 0.84 శాతం, సన్‌ఫార్మా 0.63 శాతం, ఐటీసీ 0.30 శాతం పెరిగాయి.
Top Losers : హెచ్‌యూఎల్ 3.20 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.92 శాతం, కొటక్ బ్యాంక్ 1.72 శాతం, అదానిపోర్ట్స్ 1.65 శాతం, టైటాన్ 1.57 శాతం నష్టపోయాయి.

