Homeబిజినెస్​Stock Market | నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన సూచీలు

Stock Market | నష్టాలకు బ్రేక్‌.. లాభాల బాట పట్టిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో నష్టాలకు బ్రేక్‌ పడింది. రోజంతా స్వల్ప ఒడిదుడుకులకు లోనవుతూ లాభనష్టాల మధ్య ఊగీసలాడినా చివరికి లాభాలతో ముగిశాయి.

గురువారం ఉదయం 279 పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌(Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 504 పాయింట్లు పెరిగింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఇంట్రాడే గరిష్టాల నుంచి సుమారు 700 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ (Nifty) 73 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 140 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 225 పాయింట్లు నష్టపోయింది. చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పరుగులు పెట్టాయి. చివరికి సెన్సెక్స్‌ 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833 వద్ద ముగిశాయి. వచ్చేవారంలో ఎంపీసీ మీటింగ్‌ ఉండడంతో ఇన్వెస్టర్(Investors)లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే రుతుపవనాల రాకతో ముందుగానే వర్షాలు కురుస్తుండడం, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు బాగుంటుందన్న అంచనాలు మార్కెట్‌కు సానుకూలాంశాలు.

బీఎస్‌ఈ(BSE)లో 2,020 కంపెనీలు లాభపడగా 1,957 స్టాక్స్‌ నష్టపోయాయి. 134 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 92 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 29 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 6 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 15 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్‌ విలువ రూ. 94 వేల కోట్లకుపైగా పెరిగింది.

Stock Market | రాణించిన రియాలిటీ, మెటల్‌, ఐటీ రంగాలు..

పీఎస్‌యూ బ్యాంక్స్‌(PSU banks) మినహా దాదాపు మిగిలిన ప్రధాన రంగాల ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. రియాలిటీ ఇండెక్స్‌ 1.21 శాతం పెరగ్గా.. మెటల్‌(Metal) 0.89 శాతం, ఐటీ 0.79 శాతం, టెలికాం ఇండెక్స్‌ 0.40 శాతం లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.25 శాతం నష్టపోయింది. బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.48 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.39 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం పెరిగాయి.

Stock Market | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో.. 6 కంపెనీలు మాత్రమే నష్టాలతో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌(Indusind bank) 2.41 శాతం పెరగ్గా, సన్‌ఫార్మా 2.04 శాతం, అదాని పోర్ట్స్‌ 1.92 శాతం, ఎటర్నల్‌ 1.85 శాతం, టాటా స్టీల్‌ 1.27 శాతం, టెక్‌ మహీంద్రా 1.24 శాతం పెరిగాయి.

Stock Market | Top losers..

బజాజ్‌ ఫైనాన్స్‌ 0.72 శాతం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 0.51 శాతం, ఐటీసీ 0.32 శాతం నష్టపోయాయి.