అక్షరటుడే, ఇందూరు : Teacher Promotions | రాష్ట్రంలో ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల టీచర్ల ప్రమోషన్లకు (teacher promotions) ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు (Education department officials) ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించారు.
స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా, ఎస్టీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీనియారిటీ జాబితా విడుదల చేసిన అధికారులు సర్టిఫికెట్లు కూడా పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం హెచ్ఎంల పదోన్నతుల (HM promotions) కోసం ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది.
అయితే సీనియారిటీ జాబితాలో అన్యాయం జరిగిందని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్పై విచారించిన హైకోర్టు (High Court) ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు ఆప్షన్ల ప్రక్రియను ఆగస్టు 11 వరకు నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆప్షన్ల ప్రక్రియ కొనసాగదని నిజామాబాద్ డీఈవో అశోక్ (Nizamabad DEO Ashok) తెలిపారు. సీనియారిటీ లిస్టులో తప్పిదాలను సరి చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) 52 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో లోకల్ బాడీ పాఠశాలలు 42, ప్రభుత్వ పాఠశాలలు 10 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి వీటిని భర్తీ చేయనున్నారు.