Homeబిజినెస్​Stock Market | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌.. నష్టాలతో ముగిసిన సూచీలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market | లాభాల బాటలో సాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్(Domestic stock markets)లకు బ్రేకులు పడ్డాయి. నాలుగు వరుస ట్రేడింగ్‌ సెషన్ల తర్వాత తొలిసారి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా.. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో మన మార్కెట్లు నష్టపోయాయి. సోమవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 31 పాయింట్ల స్వల్ప నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించినా అక్కడినుంచి కాస్త పుంజుకుని 72 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సెన్సెక్స్‌ 617 పాయింట్లు, నిఫ్టీ(Nifty) 133 పాయింట్లు నష్టపోయాయి. చివరికి సెన్సెక్స్‌ 452 పాయింట్ల నష్టంతో 83,606 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 25,517 వద్ద స్థిరపడ్డాయి. దేశీయంగా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకపోయినా ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు దిగడంతో మార్కెట్లు దిద్దుబాటుకు గురయ్యాయి.
బీఎస్‌ఈలో 2,362 కంపెనీలు లాభపడగా 1,750 స్టాక్స్‌ నష్టపోయాయి. 178 కంపెనీలు ఫ్లాట్‌(Flat)గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 45 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 14 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Stock Market | పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో జోరు..

పీఎస్‌యూ బ్యాంక్స్‌(PSU Banks), క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ జోరును ప్రదర్శించాయి. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.72 శాతం పెరగ్గా.. క్యాపిటల్‌ గూడ్స్‌ సూచీ 1.10 శాతం లాభపడింది. పీఎస్‌యూ 0.72 శాతం, హెల్త్‌కేర్‌ 00.56 శాతం, ఇన్‌ఫ్రా ఇండెక్స్‌ 0.36 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్‌ 0.87 శాతం, బ్యాంకెక్స్‌ 0.59 శాతం, మెటల్‌(Metal) 0.49 శాతం, ఆటో 0.49 శాతం, ఎనర్జీ 0.41 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.81 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.67 శాతం లాభపడగా.. లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.32 శాతం నష్టంతో ముగిసింది.

Top gainers:బీఎస్‌ఈలో నమోదైన షేర్లలో రేమండ్‌ 13.56 శాతం, ఫోర్స్‌ మోటార్స్‌ 11.37 శాతం, దీపక్‌ ఫర్టిలైజర్స్‌ 8.03 శాతం, రత్తన్‌ ఇండియాపవర్‌ 7.78 శాతం, కార్‌ ట్రేడ్‌ 7.28 శాతం పెరిగాయి.

Top losers:జేబీ కెమికల్స్‌ 6.65 శాతం, హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ 6.35 శాతం, జ్యోతి సీఎస్‌సీ 5.79 శాతం, కర్ణాటక బ్యాంక్‌ 5.75 శాతం, నారాయణ హృదయాలయ 4.37 శాతం నష్టపోయాయి.

Must Read
Related News