అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | వరుస నష్టాలనుంచి దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) కోలుకుంటోంది. ఐదు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. ప్రభుత్వం కొన్ని స్టీల్ దిగుమతులపై మూడేళ్లపాటు సేఫ్‌గార్డ్ సుంకాన్ని విధించడంతో స్టీల్ సెక్టార్లో బలమైన ర్యాలీ కనిపిస్తోంది.
దీనికి తోడు అన్ని రంగాలలోనూ వాల్యూ బయ్యింగ్ కనిపిస్తుండడంతో ప్రధాన సూచీలు దూసుకుపోతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 88 పాయింట్లు కోల్పోయింది. ఇంట్రాడే కనిష్టాల నుంచి కోలుకుని 307 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) 33 పాయింట్ల లాభంతో ప్రారంభమై 2 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 95 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 84,912 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 26,042 వద్ద ఉన్నాయి.
ఐటీ మినహా..
బీఎస్ఈలో ఐటీ సెక్టార్ మినహా మిగిలిన అన్ని ప్రధాన రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఐటీ ఇండెక్స్ 0.21 శాతం నష్టంతో కదలాడుతోంది. మెటల్ ఇండెక్స్ 1.64 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.63 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.62 శాతం, ఎనర్జీ 1.48 శాతం, పీఎస్‌యూ 1.45 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.19 శాతం, యుటిలిటీ 1.18 శాతం, కమోడిటీ 1.18 శాతం, పవర్ 1.13 శాతం లాభాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.90 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.80 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం లాభంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 2.42 శాతం, టైటాన్ 2.15 శాతం, పవర్‌గ్రిడ్ 1.59 శాతం, ఎన్టీపీసీ 1.52 శాతం, ట్రెంట్ 1.32 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : టీసీఎస్ 0.86 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.84 శాతం, టెక్ మహీంద్రా 0.64 శాతం, ఇన్ఫోసిస్ 0.55 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.50 శాతం నష్టాలతో ఉన్నాయి.