Homeబిజినెస్​Stock Market | వరుస లాభాలకు బ్రేక్‌.. భారీగా పతనమైన ఇండెక్స్‌లు

Stock Market | వరుస లాభాలకు బ్రేక్‌.. భారీగా పతనమైన ఇండెక్స్‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్ల(Domestic stock markets)లో ఆరు వరుస సెషన్ల తర్వాత లాభాలకు బ్రేక్‌ పడిరది. శుక్రవారం ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనించాయి. ఉదయం సెన్సెక్స్‌ 49 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 42 పాయింట్లు పెరిగింది.

గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు దిగడంతో అక్కడినుంచి 702 పాయింట్లు పడిపోయింది. 19 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ 20 పాయింట్లు పెరిగినా నిలదొక్కుకోలేకపోయింది. గరిష్టాలనుంచి 225 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 693 పాయింట్ల నష్టంతో 81,306 వద్ద, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో 24,870 వద్ద స్థిరపడ్డాయి. లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాయి. ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ స్టాక్స్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(HDFC bank), రిలయన్స్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, అదానీ పోర్ట్స్‌, కొటక్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ ఒక శాతానికిపైగా క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం ఇండెక్స్‌ల పతనానికి కారణమయ్యింది.

యూఎస్‌(US) అదనపు సుంకాల గడువు సమీపిస్తుండడంతో మదుపరులు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్ల కోత విషయంలో ఈరోజు రాత్రి నిర్వహించే సమావేశంలో ఫెడ్‌ చైర్మన్‌(Fed Chairman) ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ఇది ఫెడ్‌ చైర్మన్‌గా పావెల్‌ చివరి ప్రసంగం కానున్న నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,757 కంపెనీలు లాభపడగా 2,322 స్టాక్స్‌ నష్టపోయాయి. 161 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 151 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 53 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 10 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 3.11 లక్షల కోట్లమేర తగ్గింది.

Stock Market | టెలికాం మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు..

టెలికాం(Telecom) మినహా అన్ని ప్రధాన రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌(Metal index) 1.27 శాతం పడిపోగా పీఎస్‌యూ బ్యాంక్‌ 1.11 శాతం, కమోడిటీ 1.08 శాతం, బ్యాంకెక్స్‌ 1.06 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 1.04 శాతం, ఎనర్జీ 0.89 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.84 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఇండెక్స్‌ 0.80 శాతం, ఐటీ 0.77 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.73 నష్టపోయాయి. టెలికాం 0.68 శాతం, హెల్త్‌కేర్‌ ఇండెక్స్‌ 0.09 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 0.08 శాతం లాభపడ్డాయి. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.80 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.35 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.23 శాతం నష్టంతో ముగిశాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో, 24 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎంఅండ్‌ఎం 0.79 శాతం, మారుతి 0.65 శాతం, సన్‌ఫార్మా 0.20 శాతం, బీఈఎల్‌ 0.19 శాతం, ఎయిర్‌టెల్‌ 0.14 శాతం లాభాలతో ముగిశాయి.

Top Losers : ఆసియా పెయింట్‌ 2.44 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 1.94 శాతం,ఐటీసీ 1.84 శాతం, టాటా స్టీల్‌ 1.83 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.77 శాతం నష్టపోయాయి.

Must Read
Related News