Homeబిజినెస్​Stock Market | మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock Market | మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్లలో(Domestic stock markets) వరుస నష్టాలకు బ్రేక్‌ పడిరది. మూడు రోజుల తర్వాత భారీ లాభాలతో ముగిసింది. శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌(Sensex).. ఆ తర్వాత దూకుడు ప్రదర్శించింది. ఇంట్రాడేలో గరిష్టంగా 1,171 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ సైతం ఫ్లాట్‌గానే ప్రారంభమైనా ఆ తర్వాత 353 పాయిట్లు పైకి ఎగబాకింది. ఈ క్రమంలో మరోసారి 25 వేల పాయింట్ల మార్క్‌ను దాటి బలంగా నిలబడిరది. చివరికి సెన్సెక్స్‌ 1,046 పాయిట్ల లాభంతో 82,408 వద్ద, నిఫ్టీ(Nifty) 319 పాయింట్ల లాభంతో 25,112 వద్ద స్థిరపడిరది. బీఎస్‌ఈలో 2,463 కంపెనీలు లాభపడగా 1,484 స్టాక్స్‌ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 83 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 84 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌(Upper circuit)ను, 12 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద రూ. 3.93 లక్షల కోట్లు పెరిగింది.

Stock Market | మార్కెట్లు ఎందుకు పెరిగాయంటే..

ఇజ్రాయిల్‌, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నా మన మార్కెట్లు పెరగడం గమనార్హం. శుక్రవారం ఇంట్రాడేలో రూపాయి విలువ బలపడడం, క్రూడ్‌ ఆయిల్‌ ధర కాస్త తగ్గడం, మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలున్నా ఫారిన్‌ ఇన్వెస్టర్లు(Forign investors) మన మార్కెట్లలో నెట్‌ బయ్యర్లుగా కొనసాగుతుండడం వంటి కారణాలతో మార్కెట్లు పెరిగాయి. మూడు వరుస సెషన్లలో ఎదురైన నష్టాల తర్వాత ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడమూ మార్కెట్లు లాభాల్లోకి రావడానికి కారణంగా భావిస్తున్నారు.

Stock Market | రాణించిన అన్ని రంగాల షేర్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో శుక్రవారం అన్ని రంగాల షేర్లు రాణించాయి. బీఎస్‌ఈ(BSE)లో ప్రధానంగా టెలికాం ఇండెక్స్‌ 2.73 శాతం, రియాలిటీ ఇండెక్స్‌ 2.22 శాతం పెరిగాయి. పీఎస్‌యూ ఇండెక్స్‌ 1.59 శాతం, పవర్‌ 1.46 శాతం, ఇన్‌ఫ్రా 1.45 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.35 శాతం లాభపడ్డాయి. బ్యాంకెక్స్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, ఇండియా మాన్యుఫాక్చరింగ్‌, మెటల్‌ తదితర ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా లాభంతో ముగిశాయి. లార్జ్‌ క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 1.29 శాతం పెరగ్గా.. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.20 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.55 శాతం లాభపడ్డాయి.