ePaper
More
    HomeతెలంగాణFake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    Fake Liquor | కల్తీ మద్యానికి బ్రాండెడ్​ స్టిక్కర్లు.. బెల్ట్​ షాపులే లక్ష్యంగా విక్రయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Fake Liquor | హైదరాబాద్​(Hyderabad) నగరంలో కల్తీ మాఫియా రెచ్చిపోతుంది. ప్రతి దానిని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్​ నుంచి మొదలు పెడితే పాలు, పనీరు కూడా కల్తీ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు(Police) హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి 52 మందిని అరెస్ట్​ చేశారు. తాజాగా మద్యాన్ని కల్తీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

    Fake Liquor | స్పిరిట్​తో..

    హైదరాబాద్​లోని కృష్ణపద్మ అనే స్పిరిట్​ కంపెనీ(Krishnapadma Spirit Company)లో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. స్పిరిట్​తో మద్యం తయారు చేసి బ్రాండెడ్​ బాటిళ్లలో నింపుతున్నారు. అనంతరం వాటికి లేబుళ్లు వేసి విక్రయిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎక్సైజ్​ అధికారులు తనిఖీలు చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. పెద్దమొత్తంలో కల్తీ లిక్కర్‌(Fake Liquor)తో పాటు తయారీ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల్లికార్జున్‌, తోట శివకుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ లేబుల్స్(Fake Labels)​, సీసాలు, మూతలను స్వాధీనం చేసుకున్నారు.

    READ ALSO  Nizamabad Collector | మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని కృషి

    Fake Liquor | బెల్ట్​ షాపులకు సరఫరా

    నకిలీ మద్యం తయారు చేసి ఈ ముఠా గ్రామాల్లోని బెల్ట్​ షాపులకు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మద్యం దుకణాలకు లిక్కర్​ డిపో(Liquor Depot)ల నుంచి సరుకు వస్తుంది. దీంతో వీరు బెల్ట్​ షాపులే లక్ష్యంగా దందా నిర్వహిస్తున్నారు. స్పిరిట్​తో మద్యం తయారు చేసి, వాటికి బ్రాండెడ్​ లేబుళ్లు అతికించి విక్రయిస్తున్నారు. కాగా కల్తీ మద్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. స్పిరిట్​తో తయారు చేసి మద్యం ఆరోగ్యానికి హానికరం.

    Latest articles

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake embassy : నకిలీ ఠాణాలు, నకిలీ హాస్పిటల్స్, ఫేక్​ బ్యాంక్స్ ఇప్పటి వరకు చూశాం.....

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం...

    KCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్​కు (KTR) ట్వీట్ చేయడంతో,...

    More like this