అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Stock Market | భారత్(Bharath), పాకిస్థాన్‌ల మధ్య సీజ్‌ఫైర్ ప్రకటనతో సోమవారం రాకెట్ వేగంతో దూసుకుపోయిన సూచీలు.. మంగళవారం మాత్రం డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో భారీ నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 180 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమై ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 143 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంటాడ్రే గరిష్టాలనుంచి 1,529 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ(Nifty) 60 పాయింట్ల నష్టంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 49 పాయింట్లు లాభపడింది. అక్కడినుంచి 426 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్(Sensex) 1,281 పాయింట్ల నష్టంతో 81,148 వద్ద, నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 24,578 వద్ద స్థిరపడ్డాయి. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, యూఎస్- చైనాల మధ్య సుంకాల(Tariffs) తగ్గింపునకు కుదిరిన ఒప్పందం భారత్‌కు ప్రతికూలంగా మారనుండడం, అమెరికానుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలు పెంచాలని భారత్ నిర్ణయించడం, గత ట్రేడింగ్ సెషన్(Trading session)లో భారీ లాభాలు వచ్చినందుకు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు పతనమయ్యాయి.
బీఎస్‌ఈ(BSE)లో 2,559 కంపెనీలు లాభపడగా 1,402 స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. 140 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 76 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 30 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 16 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 8 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ. 2 లక్షల కోట్ల మేర తగ్గింది.
Stock Market | లార్జ్‌క్యాప్ డీలా.. స్మాల్ క్యాప్ భళా..
సంస్థాగత ఇన్వెస్టర్లు(Institutional investors) అమ్మకాలకు పాల్పడడంతో లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం పడిపోయింది. ఇదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు జోరు కొనసాగించడంతో స్మాల్ క్యాప్(Small cap) ఇండెక్స్ 0.99 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17 శాతం లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.2 శాతం పెరగ్గా.. క్యాపిటల్ గూడ్స్ 1.04 శాతం, హెల్త్‌కేర్ 0.96 శాతం పెరిగాయి. కన్జూమర్ డ్యూరెబుల్, పీఎస్‌యూ ఇండెక్స్‌లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ ఫోకస్డ్ ఐటీ(IT) ఇండెక్స్ అత్యధికంగా 2.44 శాతం పడిపోయింది. ఇన్‌ఫ్రా 0.7 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో(Auto), ఎఫ్‌ఎంసీజీ, టెలికాం, మెటల్, పవర్ ఇండెక్స్‌లు ఒక శాతం మేర క్షీణించాయి. రియాలిటీ 0.83 శాతం, ఎనర్జీ 0.80 శాతం, బ్యాంకెక్స్ 0.87 శాతం తగ్గాయి.
Top Losers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 25 కంపెనీలు నష్టాలతో ముగియగా 5 కంపెనీలు మాత్రమే లాభపడ్డాయి. ఇన్ఫోసిస్(Infosys) అత్యధికంగా 3.54 శాతం నష్టపోయింది. పవర్‌గ్రిడ్ 3.4 శాతం, ఎటర్నల్(Eternal) 3.38 శాతం క్షీణించాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ రెండు శాతానికిపైగా తగ్గాయి.
Top Gainers..
సన్ ఫార్మా(Sun Pharma) 0.84 శాతం లాభపడగా.. అదానిపోర్ట్స్ 0.48 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.29 శాతం పెరిగాయి.