Stock Market
Stock Market | వరుస లాభాలకు బ్రేకులు.. నష్టాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయంగా అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయంలో అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రధాన సూచీలలో మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది.

శుక్రవారం ఉదయం సెన్సెక్స్‌ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 32 పాయింట్లు పెరిగింది. అనంతరం లాభాల స్వీకరణతో ఇంట్రాడే గరిష్టాలనుంచి 493 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ(Nifty) 13 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై 18 పాయింట్లు పెరిగినా.. నిలదొక్కుకోలేక గరిష్టాలనుంచి 142 పాయింట్లు క్షీణించింది. చివరికి సెన్సెక్స్‌(Sensex) 387 పాయింట్ల నష్టంతో 82,626 వద్ద, నిఫ్టీ 96 పాయింట్ల నష్టంతో 25,327 వద్ద స్థిరపడ్డాయి. అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్‌చిట్‌ ఇవ్వడంతో ఆ గ్రూప్‌ స్టాక్స్‌ పరుగులు తీశాయి. హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌(HDFC bank), ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ స్టాక్స్‌ ప్రధాన సూచీలను వెనక్కి లాగాయి.

Stock Market | పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో కొనసాగిన ర్యాలీ..

పీఎస్‌యూ బ్యాంక్‌ స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌(PSU bank index) 1.32 శాతం పెరిగింది. యుటిలిటీ 1.56 శాతం, పవర్‌ ఇండెక్స్‌ 1.30 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 0.67 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.60 శాతం, ఇన్‌ఫ్రా 0.55 శాతం, రియాలిటీ 0.46 శాతం, ఎనర్జీ ఇండెక్స్‌ 0.32 శాతం పెరిగాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.63 శాతం, కన్జూమర్‌ డ్యూరెబుల్స్‌ 0.52 శాతం, బ్యాంకెక్స్‌ 0.46 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 0.42 శాతం, ఐటీ ఇండెక్స్‌ 0.39 శాతం నష్టపోయాయి. స్మాల్‌ క్యాప్‌(Small cap) ఇండెక్స్‌ 0.16 శాతం లాభపడగా.. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.16 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.09 శాతం నష్టపోయాయి.

Stock Market | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,134 కంపెనీలు లాభపడగా 2,001 స్టాక్స్‌ నష్టపోయాయి. 181 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 162 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 60 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 4 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 11 కంపెనీలు లాభాలతో ఉండగా.. 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదాని పోర్ట్స్‌ 1.09 శాతం, ఎయిర్‌టెల్‌ 1.05 శాతం, ఎస్‌బీఐ 0.91 శాతం, ఆసియా పెయింట్‌ 0.71 శాతం, ఎన్టీపీసీ 0.55 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.76 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.32 శాతం, టైటాన్‌ 1.26 శాతం, ట్రెంట్‌ 1.26 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.16 శాతం నష్టపోయాయి