HomeజాతీయంSabarimala | అయ్యప్ప భక్తులకు బ్రెయిన్​ ఫీవర్​ టెన్షన్​.. కీలక సూచనలు చేసిన కేరళ ప్రభుత్వం

Sabarimala | అయ్యప్ప భక్తులకు బ్రెయిన్​ ఫీవర్​ టెన్షన్​.. కీలక సూచనలు చేసిన కేరళ ప్రభుత్వం

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు బ్రెయిన్​ ఫీవర్​పై అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది. నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమల అయప్ప స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు వస్తుండడంతో శబరిమలలో (Sabarimala) రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అధికారులు రద్దీ నియంత్రణకు చర్యలు చేపట్టారు.

అయితే రద్దీతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు కేరళ ప్రభుత్వం (Kerala Government) మరో షాకింగ్​ న్యూస్​ చెప్పింది. బ్రెయిన్​ ఫీవర్​ (Brain Fever) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. కేరళలో ఇటీవల బ్రెయిన్​ ఫీవర్​ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అయ్యప్ప స్వాములు జాగ్రత్తలు పాటించాలని కేరళ వైద్యారోగ్య శాఖ (Kerala Health Department) సూచించింది. స్వాములు స్నానాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోవాలని పేర్కొంది.

Sabarimala | ప్రమాదకరమైన వ్యాధి

శబరిమల వెళ్లే యాత్రికులకు నేగ్లేరియా ఫౌలేరితో (Naegleria Fowleri) కలిగే అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (Amebic Meningoencephalitis) నుంచి రక్షించుకోవడానికి జాగ్రత్తలు పాటించాలి. ఈ అమీబా ప్రధానంగా నీటిలో ఉంటుంది. నిలకడగా ఉన్న నీటిలో ఇది ఉంటుంది. దీంతో చెరువులు, కుంటల్లో స్నానం చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముక్కులోకి నీరు వెళ్లకుండా గట్టిగా మూసుకొని స్నానం చేయాలి. నదులు, వాగుల్లో ఈ అమీబా ఉండదు. నేగ్లేరియా ఫౌలేరి చాలా ప్రమాదకరమైనది. ముక్కు ద్వారా ప్రవేశించి మెదడుకు చేరుకుంటుంది. దీనివల్ల తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, వికారం, మెడ దృఢత్వం లేదా ప్రవర్తనా లోపాలు వంటి లక్షణాలు కనిపిస్తే ప్రజలు సమీపంలోని ఆస్పత్రిని సందర్శించాలని అధికారులు సూచించారు.

Sabarimala | భక్తుల కోసం ఏర్పాట్లు

మహిళలు, పిల్లలు శబరిమల సందర్శించడానికి ఏర్పాట్లు చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు జయకుమార్ తెలిపారు. బోర్డు సోమవారం సమావేశమవుతుందన్నారు. శబరిమలలో భక్తుల సంఖ్యను పెంచడం అవసరం లేదన్నారు. సౌకర్యాలు పెంచడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. దర్శన సౌకర్యాలు నియంత్రణలో ఉన్నాయని చెప్పారు. స్పాట్ బుకింగ్‌ల సంఖ్యను పెంచినట్లు వెల్లడించారు.