ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | పాక్​ వెన్నులో భయం పుట్టించిన బ్రహ్మోస్​.. ఇది భారత్​ బ్రహ్మాస్త్రం..

    Operation Sindoor | పాక్​ వెన్నులో భయం పుట్టించిన బ్రహ్మోస్​.. ఇది భారత్​ బ్రహ్మాస్త్రం..

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​ తర్వాత పాక్​ గగన తల రక్షణ వ్యవస్థను భారత్​ నిర్వీర్యం చేసింది. అనంతరం శనివారం తెల్లవారుజామున భారత్​ సూపర్ సోనిక్ క్షిపణి అయిన బ్రహ్మోస్​ ప్రయోగం(Brahmos launch)తో రావల్పిండి లాంటి పాక్​కు చెందిన కీలక వైమానిక స్థావరాలు నిర్వీర్యం అయినట్లు తెలుస్తోంది. ఎంత అణ్వాయుధ సంపద ఉన్నా.. వాటిని రక్షించే వ్యవస్థ నిర్వీర్యం కావడంతో పాక్(Pakistan)​ భయపడి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

    భారత్​ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాల్లో లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్(Brahmos Supersonic Cruise Missile) ప్రత్యేకమైనది. డీఆర్డీవో, రష్యాకు చెందిన ఎన్పీవో మషినోస్ట్రోయేనియా సంయుక్తంగా దీనిని రూపొందించాయి. ఇందు కోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్(Brahmos Aerospace Limited) అనే సంస్థను ఇరు దేశాలు కలిసి స్థాపించాయి.

    ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, హైఅక్యూరెన్సీ క్రూయిజ్ మిసైల్ గా బ్రహ్మోస్​ను పేర్కొంటారు. భారత్​లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మాస్కవా నదుల పేర్లు వచ్చేలా ఈ మిసైల్​కు ‘బ్రహ్మోస్’ పేరు పెట్టారు. రష్యాకు (russia) చెందిన పీ800 – ఒనిక్స్ క్రూయిజ్ ఆధారంగా ఈ క్షిపణిని రూపొందించారు.

    Operation Sindoor | ఎన్నో ప్రత్యేకతలు..

    బ్రహ్మోస్ మిసైల్ (brahmos missile) ధ్వని వేగం కంటే 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. ఇది సాధారణ సబ్సెనిక్ క్షిపణుల కంటే 3 రెట్లు, సీకర్ రేంజ్ కంటే 3 నుంచి 4 రెట్లు, ఫ్లెట్ రేంజ్ కంటే 2.5 నుంచి 3 రెట్లు, కైనెటిక్ ఎనర్జీ కంటే 9 రెట్లు వేగవంతమైనది. దీని రేంజ్ 450 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. కొన్ని వెర్షన్లలో 800 కిలోమీటర్ల వరకు కూడా పరీక్షించారు. ప్రస్తుతం 500 కిలో మీటర్ల పరిధి గల వెర్షన్ డెవలెప్​మెంట్​ దశలో ఉంది. బ్రహ్మోస్​ను ‘ఆధునిక బ్రహ్మాస్త్రం'(Modern Brahmastra)గా పరిగణిస్తారు.

    Operation Sindoor | పేలోడ్, మిసైల్ బరువు

    బ్రహ్మోస్ మిసైల్ బరువు (brahmos missile weight) సుమారు 2,500 కిలోలు (గాలి నుంచి ప్రయోగించే వెర్షన్​లో 2,000 కిలోలు) ఉంటుంది. వార్ హెడ్ 200 కిలోల నుంచి 300 కిలోల బరువున్న సంప్రదాయ (కన్వెన్షనల్) / పేలుడు వార్హెడ్​ను మోసుకెళ్లగలదు. ర్యామ్ జెట్ ఇంజన్(RAM Jet Engine)​తో పనిచేస్తుంది.

    2001లో మొదటిసారి బ్రహ్మోస్​ను పరీక్షించారు. వీటిని నేవీలో 8 యుద్ధ నౌకలపై ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్ లో సుఖోయ్ 30 ఎంకేఐ విమానాల ద్వారా వినియోగిస్తున్నారు. ఆర్మీ వద్ద భూ ఆధారిత వెర్షన్​ను ఉపయోగిస్తున్నారు.

    Operation Sindoor | ప్రయోగించడం ఇలా..

    నేలపై ట్రాన్స్ పోర్టర్ ఎరెక్టర్ లాంచర్, సముద్రంలో యుద్ధ నౌకల నుంచి, గాలిలో యుద్ధ విమానాల నుంచి నేరుగా లక్ష్యం దిశగా ప్రయోగించొచ్చు. సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే బ్రహ్మోస్(Brahmos)​ ఒక్కసారిగా తన దిశను కూడా మార్చుకోగలదు. నిట్టనిలువుగా టార్గెట్ పై దాడి చేయగలదు. గుంపులో ఉన్నప్పటికీ నేరుగా దాడి చేయగలదు. ప్రపంచంలో ఏ మిసైల్​కు లేని ప్రత్యేక సామర్థ్యంగా ఈ అంశాన్ని పేర్కొనవచ్చు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...