HomeUncategorizedBrahmos | బ్ర‌హ్మోస్‌కు భారీ డిమాండ్.. కొనుగోలుకు ప‌లు దేశాల ఆసక్తి..

Brahmos | బ్ర‌హ్మోస్‌కు భారీ డిమాండ్.. కొనుగోలుకు ప‌లు దేశాల ఆసక్తి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Brahmos | పహల్​గామ్​ Pahalgam ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)కు ప్రతీకారంగా పాకిస్థాన్ భారత్​పై దాడులకు ఉప్రకమించింది. ఈ సమయంలో పాక్ డ్రోన్లు, క్షిపణులను భారత్ విజయవంతంగా నిర్వీర్యం చేసింది. అయితే పాకిస్థాన్ వాడిన డ్రోన్లు, క్షిపణులు గరిష్టంగా మేడిన్ చైనావి కావడంతో.. ఆ దేశపు ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఒక క్లారిటీ వచ్చింది. మరోవైపు పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, అక్కడున్న పలు కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది భారత్. డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా నిర్వీర్యం చేయడంలో ఎస్-400 పూర్తిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

Brahmos | బ్ర‌హ్మోస్‌కు భారీ డిమాండ్..

మరోవైపు పాక్​లో కీలక ప్రాంతాలు, ఉగ్రస్థావరాలు, పాక్ వైమానిక స్థావరాలపై భారత్ సక్సెస్ ఫుల్​గా దాడి చేయడంలో బ్రహ్మోస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. దీంతో వీటి డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారు. అవును.. బ్రహ్మోస్ అనేది ఒక క్షిపణి మాత్రమే కాదు.. భారత సైనిక(Indian Army) బలానికి శక్తివంతమైన ప్రతీక అని.. ఇది కేవలం ఒక ఆయుధం కాదు.. శత్రుదేశాలకు ఇదొక సందేశం అని చెప్పుకొస్తున్నారు. భారతదేశ రక్షణ ఎగుమతులకు ఒక ముఖ్యమైన మైలురాయిగా.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్(Brahmos supersonic cruise) క్షిపణి వ్యవస్థల రెండో బ్యాచ్​ను ఫిలిప్పీన్స్‌కు పంపించారు. ఇది ప్రపంచ రక్షణ మార్కెట్‌లో భారతదేశం India పాత్రను మరింత పటిష్టం చేస్తుంది.

భారతదేశం నుంచి బ్రహ్మోస్(Brahmos) క్షిపణులను కొనుగోలు చేయడానికి చాలా దేశాలు ఆసక్తి చూపడం ప్రారంభించాయి. ఈ క్షిపణులకు మొదటి నుంచి మంచి గుర్తింపు ఉంది. ఇవి టార్గెట్లను విజయవంతంగా ఛేదిస్తున్నాయి. భారీ పేలుడు సృష్టించి.. తీవ్రమైన నష్టం కలిగించి, శత్రువులు షాక్ అయ్యేలా చేస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలకు ఈ క్షిపణులు బాగా నచ్చుతున్నాయి. థాయిలాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణులు(Brahmos missiles) కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇన్ని దేశాలు అడుగుతుండడంతో ఇది భారత్‌కి అతిపెద్ద ఆయుధ డీల్ కానుంది. భారీగా సంపాదించుకునే ఛాన్స్ కానుంది. ఇప్పుడు ప్రపంచ రక్షణ మార్కెట్ లో బ్రహ్మోస్ అగ్ర ఎంపికగా ఉందని చెబుతున్నారు.