HomeUncategorizedBrahmos | త్వరలో బ్రహ్మోస్​ క్షిపణి ఉత్పత్తి ప్రారంభం

Brahmos | త్వరలో బ్రహ్మోస్​ క్షిపణి ఉత్పత్తి ప్రారంభం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Brahmos | భారత్​ – రష్యా(India – Russia) సంయుక్తంగా రూపొందించిన బ్రహ్మోస్​ క్షిపణులు (Brahmos Missiles) అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించగలవు. ఇప్పటికే బ్రహ్మోస్​ క్షిపణులు విజయవంతంగా పలు పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. ఈ సూపర్​ సోనిక్​ క్షిపణి ఉత్పత్తి త్వరలో లక్నో(Lucknow)లో ప్రారంభం కానుంది.

ప్రస్తుతం రష్యాలో వీటిని తయారు చేస్తున్నాయి. అయితే మేకిన్​ ఇండియాలో భాగంగా భారత్​లో ప్లాంట్​ను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్​లోని లక్నోలో రూ.300 కోట్లతో బ్రహ్మోస్​ ఏరోస్పేస్​ ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్​ను మే 11న రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ (Defense Minister Rajnath Singh)​ ప్రారంభించనున్నపారు.

బ్రహ్మోస్ క్షిపణి తయారీ రక్షణ రంగంలో కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అదే రోజున బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రాజెక్ట్(BrahMos Aerospace Project), డిఫెన్స్ నోడ్‌(Defense Node)ను ప్రారంభిస్తారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్​ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021లో బ్రహ్మోస్‌కు 80 హెక్టార్ల భూమిని ఉచితంగా కేటాయించారు. రూ. 320 కోట్లతో మొదటి దశ పెట్టుబడి పెట్టిన ఏరోలాయ్ టెక్నాలజీకి 20 హెక్టార్ల భూమిని కేటాయించారు. ఈ సంస్థ ఉత్పత్తులను చంద్రయాన్ మిషన్, యుద్ధ విమానాలు వంటి కీలక ప్రాజెక్టులలో ఉపయోగిస్తారు.