అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Floods | పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్ లో జరగబోయే విశేషాల గురించి ముందే తాళ పత్ర గ్రంథాల్లో భద్రపరిచిన విషయం మనకు తెలిసిందే. దీనినే మనందరం బ్రహ్మంగారి కాలజ్ఞానం (brahmam gari kalagnanam) అని అంటాం.
అయితే ఈ మధ్య కాలంలో మనకు కనిపించిన కొన్ని వింత ఘటనలు బ్రహ్మం వారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన చెప్పినట్లు.. కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా హైదరాబాద్‌ని మూసీ నది (Hyderabad Musi River) ముంచెత్తడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రహ్మంగారు అప్పట్లోనే హైదరాబాద్‌ను మూసీ నది ముంచి వేస్తుందని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మూసీ నది ఎన్నడూ లేనంతగా మహోగ్రరూపం దాల్చి హైదరాబాద్‌ను ముంచెత్తింది.
Hyderabad Floods | ఎన్నడూ లేనంత వరద..
హైదరాబాద్ (Hyderabad) మహానగరాన్ని గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి విపత్తు అతలాకుతలం చేసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లు ఎత్తడం, వరదనీరు భారీగా ప్రవహించడం వల్ల నగరంలో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మూసీ నది (Musi River) పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 అడుగుల ఎత్తుతో ప్రవహిస్తుండడం చూసి అందరూ వణికిపోయారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ప్రజలు భయంతో సురక్షిత ప్రాంతాలకూ తరలివెళ్లారు. నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్, రవాణా సేవలు నిలిచిపోయాయి.
భారీ వరద ప్రభావంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) పూర్తిగా నీట మునిగింది. దీంతో చరిత్రలోనే తొలిసారి ఈ బస్టాండ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. రెండు ప్రధాన బ్రిడ్జిలు వరద నీటితో మునిగిపోయి, బస్సులు రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. సిటీలో అత్యవసర చర్యల కోసం డీఆర్‌ఎఫ్, జీహెచ్ఎంసీ (GHMC), పోలీస్, హైడ్రా, ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో పనిచేశాయి. 1000 మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించి, భోజనం, నివాసం వంటి అవసరాలను ప్రభుత్వం అందించింది.
గతంలో ఎప్పుడూ లేనంతంగా వచ్చిన వరదల వలన చాదర్‌ఘాట్ (Chaderghat) లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర వరద నీరు ప్రవహించింది. ఇక ముసారాంబాగ్ వంతెన పైనుంచి ఏకంగా 10 అడుగుల మేర నీరు ప్రవహించడం అందరినీ భయానికి గురి చేసింది. మరోవైపు ఎంజీబీఎస్ (మహాత్మాగాంధీ బస్ స్టేషన్) లోపలకి వెళ్లే రెండు వంతెనలు పూర్తిగా నీట మునిగిపోయాయి. చాదర్‌ఘాట్ కాజ్‌వే వంతెన, మూసారాంబాగ్ బ్రిడ్జితో సహా పలు ప్రాంతాల్లో రహదారులను పూర్తిగా మూసివేసి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
View this post on Instagram