HomeUncategorizedBrahmaji | పెళ్లై పిల్లాడు ఉన్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ.. వైఫ్ అంటే...

Brahmaji | పెళ్లై పిల్లాడు ఉన్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్రహ్మాజీ.. వైఫ్ అంటే ఇంత ప్రేమ‌నా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Brahmaji | బ్ర‌హ్మాజీ.. ఈ పేరు గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌మెడీయ‌న్‌, కామెడీ విలన్​గా పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం సీనియర్ నటుడిగా ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. దర్శకుడు కృష్ణ వంశీ చిత్రాల్లో రెగ్యులర్​గా కనిపించే బ్ర‌హ్మాజీ Brahmaji 90ల చిత్రాల నుంచే ఆడియెన్స్​ను అలరిస్తూ వస్తున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. ‘సింధూరం'(Sindhuram) చిత్రంతో హీరోగానూ పరిచయం అయ్యారు. ఆ తర్వాత విభిన్న పాత్రలు పోషిస్తూ 200 వరకు సినిమాలు చేశారు. నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా(Social Media)లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

Brahmaji | చాలా ప్రేమ‌..

ఈ మ‌ధ్య బ్రహ్మాజీ(Brahmaji) పర్సనల్ విషయాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. పెళ్లి అయి పిల్లాడు ఉన్న మహిళను బ్రహ్మాజీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ ప్రేమ కథ గురించి కూడా బ్రహ్మాజీ ఇది వరకు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. త‌న భార్యతో ప్రపంచ దేశాలు తిరగడం తనకు ఇష్టమని బ్రహ్మాజీ చెబుతుంటాడు. తాను సంపాదించిన డబ్బు అంతా కూడబెట్టడం గానీ, ఇన్వెస్ట్ చేయడం వంటివి చేయ‌డ‌ట‌. భార్య‌తో అలా ప్ర‌పంచ దేశాలు తిరిగి రావ‌డ‌మే త‌న‌కు ఇష్టం అంటున్నాడు. ట్రావెలింగ్‌కే తన డబ్బు అంతా ఖర్చు చేస్తున్న నేప‌థ్యంలో ఎక్కువ ఆస్తులు కూడా కూడబెట్టుకోలేదని బ్రహ్మాజీ అంటుంటాడు.

బ్రహ్మాజీ తాజాగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ(Wedding Anniversary) వెరైటీగా చెప్పాడు. పెరుగన్నంలోకి ఆవకాయ్​లా.. పాలకు డెవిడోఫ్ కాఫీలా.. వోడ్కాకి జింజిర్ ఆలేలా.. నా జీవితానికి నవ్వుల్లా.. నన్ను భరిస్తున్నందుకు థాంక్స్.. హ్యాపీ యానివర్సరీ శాశ్వతి అంటూ బ్రహ్మాజీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నెట్టింట్లో బ్రహ్మాజీ వేసే ట్వీట్లు ఎంత ఫన్నీగా Funnyఉంటాయో.. అంత కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. అప్పుడప్పుడు బ్రహ్మాజీ పొలిటికల్ సెటైర్లు కూడా వేస్తుంటాడు. రీసెంట్‌గా బౌన్సర్ల వ్యవస్థ మీద బ్రహ్మాజీ చురకలు అంటించ‌డం మ‌నం చూశాం. గ‌తంలో మాదిరిగా బ్ర‌హ్మాజీ సినిమాలు చేయ‌డం లేదు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ అయితే చిన్నా చితకా ప్రాజెక్టులతో ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.