అక్షరటుడే, వెబ్‌డెస్క్: Boyfriend detonates detonator : కర్ణాటక (Karnataka) లో ఘోరమైన ఘటన వెలుగుచూసింది. ఇక్కడి మైసూర్ జిల్లా (Mysore district) సాలిగ్రామ్‌లో ఓ యువకుడు తన ప్రియురాలిని దారుణంగా హతమార్చాడు. లాడ్జిలో దర్శిత(22 ) అనే యువతిని సిద్దరాజు అనే యువకుడు హత్య చేశాడు.
యువతి దర్శిత నోట్లో ఎలక్ట్రానిక్ డిటోనేటర్ (electronic detonator) పెట్టి పేల్చేశాడు సిద్దరాజు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తీవ్రమైన పేలుడు ధాటికి యువతి దర్శిత ముఖం పూర్తిగా ఛిద్రమయ్యింది.
Boyfriend detonates detonator : పేలుడు ధాటికి ముఖం ఛిద్రం
పేలుడు ధాటికి గుర్తుపట్టని రీతిలో దర్శిత ముఖం మారిపోయింది. దర్శితకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కేరళ (Kerala) లోని కన్నూరు జిల్లా పడియూర్‌కు చెందిన సుభాష్‌తో దర్శిత వివాహం జరిగింది. సుభాష్ దుబాయ్‌లో డ్రైవరుగా పనిచేస్తున్నాడు.
కాగా దర్శిత పెళ్లికి ముందే సిద్దరాజుతో ప్రేమలో ఉంది. పెళ్లి అయినాక కూడా సిద్దరాజుతో దర్శిత వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లుగా తేలింది. యువతి దర్శితకు రెండేళ్ల కూతురు ఉంది.
Boyfriend detonates detonator : కూతురితో సహా అదృశ్యం..
దర్శిత ఇటీవల తన కూతురితో సహా అదృశ్యమైంది. కాగా, సాలిగ్రామ్ లాడ్జిలో దర్శిత మరణించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సెల్‌ఫోన్ పేలడంతో దర్శిత మరణించినట్లు సిద్దరాజు నమ్మించే ప్రయత్నం చేశాడు.
కానీ, పోలీసులకు అనుమానం వచ్చి సిద్దరాజును అదుపులోకి తీసుకుని విచారించడంతో నిజం తెలిసింది. దర్శిత నోట్లో డిటోనేటర్ పెట్టి, మొబైల్ ఛార్జర్ కేబుల్‌కు కనెక్ట్ చేసి ఆమెను హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు.
దర్శితను సిద్దరాజు ఎందుకు చంపాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శిని అత్తారింటి నుంచి రూ. 22 లక్షల విలువైన నగలతోపాటు రూ. 4 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆమె అత్తింటి తరఫు వారు పోలీసులకు తెలిపారు.
కానీ, సిద్దరాజు వద్ద ఎలాంటి డబ్బు దొరకలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మరి దర్శినిని సిద్దరాజు నగలు, నగదు కోసమే చంపేశాడా.. దర్శినిని చంపాక.. సిద్దరాజు నగలు, నగదును మాయం చేశాడా.. లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.